Share News

Ooty Flower Show: మే 17 నుంచి ఊటీ ఫ్లవర్‌ షో

ABN , Publish Date - Mar 08 , 2024 | 10:20 AM

ప్రముఖ పర్యాటక కేంద్రం నీలగిరి జిల్లా ఊటీ బొటానికల్‌ పార్క్‌లో 126వ ఫ్లవర్‌ షో మే 17 నుంచి 22వ తేది వరకు జరుగనుంది. ప్రజలు మే నెలలో చల్లటి ప్రాంతాలకు కుటుంబాలతో వెళుతుంటారు.

Ooty Flower Show: మే 17 నుంచి ఊటీ ఫ్లవర్‌ షో

చెన్నై: ప్రముఖ పర్యాటక కేంద్రం నీలగిరి జిల్లా ఊటీ బొటానికల్‌ పార్క్‌లో 126వ ఫ్లవర్‌ షో మే 17 నుంచి 22వ తేది వరకు జరుగనుంది. ప్రజలు మే నెలలో చల్లటి ప్రాంతాలకు కుటుంబాలతో వెళుతుంటారు. ఆ ప్రకారం, రాష్ట్రంలో ఊటీ, కొడైకెనాల్‌, ఏర్కాడు సహా పలు పర్వత ప్రాంతాలకు ప్రజలు పెద్దసంఖ్యలో వెళుతుంటారు. అలా వచ్చే వారికి మరింత ఆహ్లాదం కలిగించేలా ఉద్యానవన, వ్యవసాయ శాఖ, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పుష్ప, కాయగూరలు, సుగంధద్రవ్యాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది ఊటీలో 126వ పుష్ప ప్రదర్శన మే 17 నుంచి 22వ తేది వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ అరుణ గురువారం తెలిపారు. అలాగే, కున్నూర్‌ సిమ్స్‌ పార్క్‌లో మే 24 నుంచి 26వ తేది వరకు 64వ పండ్ల ప్రదర్శన ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Mar 08 , 2024 | 10:20 AM