Share News

LokSabha Elections: ప్రధాని మోదీ సభలో ‘ఆమె’ ఎవరు?

ABN , Publish Date - May 30 , 2024 | 02:34 PM

సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఒడిశాలోని కేంద్రపాడ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ ర్యాలీలో ఓ మహిళ కాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ తాకి నమస్కరించారు.

LokSabha Elections: ప్రధాని మోదీ సభలో ‘ఆమె’ ఎవరు?

భవనేశ్వర్, మే 30: సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఒడిశాలోని కేంద్రపాడ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ ర్యాలీలో ఓ మహిళ కాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ తాకి నమస్కరించారు. అయితే ఆమె ఎవరు? ఏమిటనే ఓ చర్చ అయితే జరుగుతుంది. ఆమె గురించి గతంలో అంటే.. 2024, ఫిబ్రవరి 25వ తేదీన తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Lok Sabha Elections 2024: భారీగా పెరిగిన రాజకీయ పార్టీలు


ఆమె పేరు కమలా మహరాణా. ఆమె వయస్సు 63 సంవత్సరాలు. కేంద్రపాడ నగరంలోని గుల్‌నగర్‌లో నివసిస్తుంది. అయితే కమలా మహరాణా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందం పని చేస్తుంది. పనికిరాని పాల ప్యాకెట్లతోపాటు మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి.. వాటిని అందరికీ ఉపయోగ పడే వస్తువులుగా తయారు చేస్తుంటారు. ఈ విషయాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కమలా మహరాణా గురించి పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి సంపదను ఆమె సృష్టిస్తుందన్నారు.

CEO MK Meena: కృష్ణావర్శిటీలో సీఈవో ఎంకే మీనా కౌంటింగ్ కేంద్రం తనిఖీ..


అలాగే ప్రభుత్వం తీసుకు వచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్‌కు ఆమె రూపు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆమెను సోదరిగా పిలిచారు. మరోవైపు ప్లాస్లిక్ వ్యర్థాలతో రాఖీని తయారు చేసి... ప్రధాని మోదీకి కానుకగా పంపిన విషయం తెలిసిందే.

Delhi: దేశం కోసం 100 సార్లైనా జైలుకు వెళ్తా.. గర్వంగా ఉందన్న కేజ్రీవాల్

For Latest News and National News click here..

Updated Date - May 30 , 2024 | 03:17 PM