Share News

LokSabha Elections Result: ఎన్నికల ఫలితాలపై అగ్నిపథ్ ప్రభావం

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:12 PM

భారత సైన్యంలో చేరేందుకు మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్‌ నియామక పథకంపై సమీక్ష నిర్వాహించాలని జేడీయూ నేత కేసీ త్యాగి స్పష్టం చేశారు. ఈ అగ్నిపథ్ నియామక పథకంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆయన పేర్కొన్నారు.

LokSabha Elections Result: ఎన్నికల ఫలితాలపై అగ్నిపథ్ ప్రభావం
JD(U) Leader KC Tyagi

న్యూఢిల్లీ, జూన్ 06: భారత సైన్యంలో చేరేందుకు మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్‌ నియామక పథకంపై సమీక్ష నిర్వాహించాలని జేడీయూ నేత కేసీ త్యాగి స్పష్టం చేశారు. ఈ అగ్నిపథ్ నియామక పథకంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆయన పేర్కొన్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఈ అగ్నిపథ్ పథకం ఎన్డీయేపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అగ్నిపథ్ పథకంపై సమీక్ష చేయాల్సిన అవసరం తప్పక ఉందన్నారు.


భారత సైన్యంలో ప్రవేశించదలచుకున్న వారు.. తొలి నాలుగేళ్లు పని చేసేలా ఒప్పందం చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల అనంతరం వారిలో 25 శాతాన్ని సైన్యంలో కొనసాగిస్తారు. మిగిలిన వారిని వెనక్కి పంపించేస్తారు. అలా అగ్నిపథ్ పథకాన్ని మోదీ ప్రభుత్వం రూపొందించింది. అయితే దీనిని అమలు చేయడంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకంపై బిహార్, ఉత్తరప్రదేశ్‌లో భారీగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి.

2022లో మోదీ ప్రభుత్వాన్ని ఈ పథకాన్ని తీసుకు వచ్చిన విషయం విధితమే. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. అయితే ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిపదవుల అంశంపై బీజేపీతో జేడీయూ చర్చిస్తుంది. ఆ క్రమంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ (యూ) అధినేత నితిష్ కుమార్‌తో కలిసి కేసీ త్యాగి బుధవారం న్యూఢిల్లీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో త్యాగి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2024 | 05:19 PM