New Year: నూతన సంవత్సర వేడుకలు రాత్రి ఒంటిగంట వరకే..
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:54 PM
నూతన సంవత్సర వేడుకలు రాత్రి ఒంటిగంట వరకే జరుపుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్(Bangalore City Police Commissioner Dayanand) తెలిపారు.

- మెట్రో సంచారం ఉండదు... ఫ్లై ఓవర్ల మూసివేత
- నగర కమిషనర్ దయానంద్
బెంగళూరు: నూతన సంవత్సర వేడుకలు రాత్రి ఒంటిగంట వరకే జరుపుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్(Bangalore City Police Commissioner Dayanand) తెలిపారు. శనివారం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 31న మంగళవారం ఏడాది ముగింపు వేడుకలు రాత్రి ఒంటిగంట వరకూ మాత్రమే పరిమితం చేశామన్నారు. పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లు ఒంటిగంటకు మూసివేయాలని ఆదేశించామన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Ballari: భయం.. భయం.. ఆందోళనలో గర్భిణులు
ఎయిర్‌పోర్టు రోడ్‌తో పాటు నగర పరిధిలోని అన్ని ఫ్లైఓవర్‌లను మూసివేస్తామన్నారు. మధ్యం మత్తులో వాహనాలు ఇష్టారాజ్యంగా తిరగకుండా కట్టడి చేస్తామన్నారు. నగర పరిధిలో ఎటువంటి హింసాత్మకం, ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే ముగ్గురు విదేశీ డ్రగ్‌పెడ్లర్‌లతో పాటు 70మందిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బెంగళూరు శివారు ప్రాంతాల్లో రేవ్ పార్టీలపైనా నిఘా ఉంటుందన్నారు. ఎంజీ రోడ్, బ్రిగేడ్, కోరమంగల, ఇందిరానగర్‌లలో ఎక్కువ మంది ప్రజలు చేరుతున్నందున సేఫ్టీ ఐలాండ్, సీసీ టీవీలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. బ్రిగేడ్, ఎంజీ రోడ్‌లలో ఒక వైపు మాత్రమే సంచరించేందుకు వీలుంటుందని రాత్రి 11గంటల తర్వాత ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్‌ను మూసివేస్తామన్నారు. కానీ మెట్రో సేవలు రాత్రి 2 గంటలకు కొనసాగుతాయని మెట్రో కార్పొరేషన్ ప్రకటించింది. మెజస్టిక్ నుంచి రాత్రి 2.40 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరనున్నట్లు ప్రకటించారు. గతంలో ఏడాది ఆఖరు రోజున చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: 7న విచారణకు రండి
ఈవార్తను కూడా చదవండి: Dharani: సంక్రాంతిలోపే భూ భారతి!
ఈవార్తను కూడా చదవండి: Nalgonda: ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగను తాకి..
ఈవార్తను కూడా చదవండి: భార్య, పిల్లలకు విషం ఇచ్చి.. ఉరేసుకున్న కానిస్టేబుల్
Read Latest Telangana News and National News