Share News

Ayodhya Ram Temple: మళ్లీ విషం చిమ్మిన ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూన్.. సంచలన వీడియో

ABN , Publish Date - Jan 09 , 2024 | 08:56 PM

అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ శుభవేళ ఖలిస్థాన్ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి భారత్‌పై విషం చిమ్మాడు. రామ మందిర ప్రతిష్ఠాన కార్యక్రమానికి హాజరుకాకుండా అమృత్‌సర్ నుంచి అయోధ్యకు వెళ్లే విమానాశ్రయాలను మూసివేయాలని పిలుపునిచ్చాడు.

Ayodhya Ram Temple: మళ్లీ విషం చిమ్మిన ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూన్.. సంచలన వీడియో

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం (Ayodhya Ram Temple) ప్రారంభోత్సవ శుభవేళ ఖలిస్థాన్ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurupatvant Singh Pannun) మరోసారి భారత్‌పై విషం చిమ్మాడు. రామ మందిర ప్రతిష్ఠాన కార్యక్రమానికి హాజరుకాకుండా అమృత్‌సర్ నుంచి అయోధ్యకు వెళ్లే విమానాశ్రయాలను మూసివేయాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశాడు.


ఇది మరో ఆపరేషన్ బ్లూస్టార్..

''బాబ్రీ మసీదుపై ఆలయాన్ని నిర్మించారు. ప్రపంచ ముస్లింల శత్రువు మోదీ. ఇండియాలో ఉర్దూస్థాన్ ఏర్పాటు చేసేందుకు ముస్లింలకు తరుణం వచ్చింది. 22వ తేదీ ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ ఆపరేషన్ బ్లూస్టార్ చేపపడుతున్న రోజు'' అంటూ పన్నూన్ తీవ్రమైన వ్యా్ఖ్యలు చేశాడు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)కింద పన్నూన్‌ను 2020లో భారత ప్రభుత్వం డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అమృత్‌సర్, ఛండీగఢ్‌లోని పన్నూన్ ఆస్తులను గత సెప్టెంబర్‌లో సీజ్ చేసింది.

Updated Date - Jan 09 , 2024 | 08:56 PM