Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Movie actor: తన మనసులో మాట చెప్పేసిన సినీ నటుడు.. నా భార్యను ఎంపీగా చూడాలని ఉంది..

ABN , Publish Date - Mar 03 , 2024 | 01:33 PM

‘నా భార్య గీతను శివమొగ్గ ఎంపీగా చూడాలని ఉంది’ అని ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్‌(Actor Shivrajkumar) పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇస్తే పోటీ చేయిస్తామని తెలిపారు.

Movie actor: తన మనసులో మాట చెప్పేసిన సినీ నటుడు.. నా భార్యను ఎంపీగా చూడాలని ఉంది..

- కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇస్తే శివమొగ్గ నుంచి పోటీ చేయిస్తాం

- సినీ నటుడు శివరాజ్‌కుమార్‌

బెంగళూరు: ‘నా భార్య గీతను శివమొగ్గ ఎంపీగా చూడాలని ఉంది’ అని ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్‌(Actor Shivrajkumar) పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇస్తే పోటీ చేయిస్తామని తెలిపారు. శివమొగ్గ జిల్లా కల్లహళ్లిలో మంత్రి మధుబంగారప్ప జన్మదిన వేడుకలలో శివరాజ్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గీత ఎంపీ అయితే మహిళా నేతలకు ఆదర్శంగా ఉంటారని తెలిపారు. తాను ఎట్టి పరిస్థితిలోను రాజకీయాలలోకి వచ్చేది లేదన్నారు. తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. కష్టం అని వస్తే డబ్బులు ఇచ్చి పంపుతాను కానీ రాజకీయాలు తెలియవన్నారు. బంగారప్ప సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్నారని, ముఖ్యమంత్రిగా వ్యవహరించారని ఇలా తండ్రి బాటలోనే గీత వెళ్లదలచుకుంటే అభ్యంతరం లేదన్నారు. రాజకీయాలు వారి రక్తంలోనే ఉన్నాయని, ఎంపీగా పోటీ చేసి గెలిస్తే సంతోషిస్తానని అన్నారు. తన తదుపరి సినిమా ‘కరటక దమనక’ కథ బాగుందని, మరో పేరు పెట్టవచ్చు కానీ కథ కోసం అదే టైటిల్‌ను సిద్ధం చేసుకున్నామన్నారు. మంత్రి మధుబంగారప్పకు స్వయాన సోదరి గీత శివరాజ్‌కుమార్‌ అనే విషయం తెలిసిందే.

pandu1.2.jpg

Updated Date - Mar 03 , 2024 | 01:33 PM