Mobile app: మహానగర రవాణా సిబ్బంది కోసం మొబైల్ యాప్
ABN , Publish Date - Mar 01 , 2024 | 11:33 AM
మహానగర రవాణా సంస్థ ఉద్యోగులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్(Mobile app)ను రాష్ట్ర రవా ణా శాఖ మంత్రి ఎస్‌ఎస్ శివశంకర్ గురువారం ఉదయం ప్రారంభించారు.
చెన్నై: మహానగర రవాణా సంస్థ ఉద్యోగులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్(Mobile app)ను రాష్ట్ర రవా ణా శాఖ మంత్రి ఎస్‌ఎస్ శివశంకర్ గురువారం ఉదయం ప్రారంభించారు. సచివాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఈ యాప్‌తోపాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టికెట్లను రిజర్వు చేసుకునేవారు రూ.40లను అదనంగా చెల్లించి కిలాంబాక్కం బస్‌టెర్మినల్ నుంచి నగరంలో ఇతర ప్రాంతాలకు, అదే విధంగా నగరంలోని పలు ప్రాంతాల నుండి కిలాంబాక్కంకు సిటీ బస్సుల్లో ప్రయాణించే సదుపాయానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ యాప్ ద్వారా రవాణా సంస్థ ద్వారా వచ్చే ఉత్తర్వులు, రవాణా కార్మికులకు అందజేయనున్న సదుపాయాల ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలియజేస్తామని మంత్రి శివశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహానగర రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అల్పీజాన్ వర్గీస్, ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇరా మోహన్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కే గుణశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.