Share News

Minister: అన్నభాగ్యకు బియ్యం లేవు కానీ.. ఇంటింటికీ అక్షింతలా..?

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:24 AM

అన్నభాగ్య గ్యారెంటీకి బియ్యం లేవు కానీ అయోధ్యలో రామమందిర ప్రారంభం కోసమని ఇంటింటికీ అక్షింతలు పంపిణీ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక సాంఘిక సంక్షేమశాఖా మంత్రి మహదేవప్ప(Minister Mahadevappa) మండిపడ్డారు.

Minister: అన్నభాగ్యకు బియ్యం లేవు కానీ.. ఇంటింటికీ అక్షింతలా..?

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అన్నభాగ్య గ్యారెంటీకి బియ్యం లేవు కానీ అయోధ్యలో రామమందిర ప్రారంభం కోసమని ఇంటింటికీ అక్షింతలు పంపిణీ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక సాంఘిక సంక్షేమశాఖా మంత్రి మహదేవప్ప(Minister Mahadevappa) మండిపడ్డారు. గురువారం ఆయన ఎక్స్‌ ద్వారా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆకలిలేని రాష్ట్రంగా తీర్చేందుకు ప్రభుత్వం ప్రతి బీపీఎల్‌ లబ్దిదారుడికి కేంద్రం ఇచ్చే ఐదుకేజీల బియ్యంకు అదనంగా రాష్ట్రం నుంచి ఐదుకిలోలు ఇవ్వదలచామన్నారు. కేంద్ర పౌర ఆహారసరఫరాల విభాగం నుంచి నిర్దేశించిన ధరకంటే ఎక్కువ మొత్తంతో కొనుగోలు చేస్తామని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదన్నారు. కానీ మతం పేరుతో అక్షింతలను ఇంటింటికీ పంపిణీ చేయడం సర్వమత విధానాలకు వ్యతిరేకమన్నారు. పేదవాడి ఆకలి తీర్చడం కంటే మతం గొప్పదా అని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చే బియ్యంలోను రాజకీయం చేసిన వీరు మతం గురించి మాట్లాడుతారన్నారు. ఈవిషయమై నవ్వాలో ఏడ్వాలో నాకు అర్థం కావడం లేదని మండిపడ్డారు.

Updated Date - Jan 12 , 2024 | 10:24 AM