Share News

Metro trains: మూడు పెట్టెలతో 138 డ్రైవర్‌ రహిత మెట్రోరైళ్లు.. ఎప్పటినుంచంటే..

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:07 PM

నగరంలో మెట్రోరైలు(Metro Rail) రెండో ప్రాజెక్టులో మూడు మార్గాల్లో 116.1 కి.మీ పనులు వివిధ దశల్లో ముమ్మరంగా సాగుతున్నాయి. వాటిలో మాధవరం పాల డిపో నుంచి సిప్కాట్‌ వరకు 45.8 కి.మీ మూడో మార్గం, లైట్‌ హౌస్‌ నుంచి పూందమల్లి వరకు 26.1 కి.మీ నాల్గో మార్గం, మాధవరం(Madhavaram) నుంచి షోళింగనల్లూర్‌ వరకు 47 కి.మీ ఐదో మార్గం పనులు రూ.63,246 కోట్లతో జరుగుతున్నాయి.

Metro trains: మూడు పెట్టెలతో 138 డ్రైవర్‌ రహిత మెట్రోరైళ్లు.. ఎప్పటినుంచంటే..

- 2025 ఆగస్టులో పట్టాలపైకి : సీఎంఆర్‌ఎల్‌

చెన్నై: నగరంలో మెట్రోరైలు(Metro Rail) రెండో ప్రాజెక్టులో మూడు మార్గాల్లో 116.1 కి.మీ పనులు వివిధ దశల్లో ముమ్మరంగా సాగుతున్నాయి. వాటిలో మాధవరం పాల డిపో నుంచి సిప్కాట్‌ వరకు 45.8 కి.మీ మూడో మార్గం, లైట్‌ హౌస్‌ నుంచి పూందమల్లి వరకు 26.1 కి.మీ నాల్గో మార్గం, మాధవరం(Madhavaram) నుంచి షోళింగనల్లూర్‌ వరకు 47 కి.మీ ఐదో మార్గం పనులు రూ.63,246 కోట్లతో జరుగుతున్నాయి. ఈ మార్గాల్లో 119 మెట్రో రైల్వేస్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ పనులను 2026 సంవత్సరాంతానికి పూర్తి చేయాలని చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో, రెండో ప్రాజెక్ట్‌లో డ్రైవర్‌ రహిత మెట్రోరైళ్లు నడపనున్నట్లు సీఎంఆర్‌ఎల్‌(CMRL) ప్రకటించింది. డ్రైవర్‌ రహిత మెట్రోరైలు 2025 ఆగస్టు నుంచి పట్టాలపైకి ఎక్కనుంది. ఈ విషయమై సీఎంఆర్‌ఎల్‌ అధికారులు మాట్లాడుతూ.. రెండో విడత మెట్రోరైలు పథకంలో మూడు పెట్టెలతో 138 రైళ్లు నడపనున్నామని తెలిపారు. ఈ రైళ్ల తయారీ మూడు సంస్థలకు అప్పగించామని తెలిపారు. ఆటోమేటిక్‌ ఏఐ టెక్నాలజీతో, జీపీఎస్‌, సిగ్నల్‌ రీడింగ్‌, టైమింగ్‌ సీక్వెన్స్‌ తదితర సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. అలాగే, ఈ మెట్రోరైళ్లకు ఎల్‌సీడీ స్ర్కీన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ రైళ్లు ప్రజల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుగా ఏడాది పాటు వివిధ దశల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని తెలిపారు. మరో నెలరోజుల్లో తొలి డ్రైవర్‌ రహిత మెట్రోరైలు తయారీ పూర్తవుతుందని, అనంతరం ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామన్నారు. తొలివిడతగా పూందమల్లి - పోరూర్‌ మధ్య నడుపనున్న 26 డ్రైవర్‌ రహిత మెట్రోరైళ్లు వచ్చే ఏడాది సీఎంఆర్‌ఎల్‌కు అప్పగించనున్నారని వారు తెలిపారు.

ఇదికూడా చదవండి: Hero Vijay: ఈ ఎన్నికల్లో ఇళయ దళపతి వర్గం ఎటువైపో?

Updated Date - Apr 14 , 2024 | 01:07 PM