Share News

India - Maldives Row: ప్లేటు తిప్పేసిన మాల్దీవుల ఎంపీ.. మోదీపై అలా, మంత్రిపై ఇలా!

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:48 PM

పర్యాటక రంగంలో తమకు తిరుగులేదన్న అహంకారంతో.. మాల్దీవుల నేతలు తమ గోతిని తామే తవ్వుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశంపై కించపరిచే వ్యాఖ్యలు చేసి.. సర్వత్రా విమర్శలు మూటగట్టుకుంటున్నారు. మాల్దీవుల్ని బాయ్‌కాట్..

India - Maldives Row: ప్లేటు తిప్పేసిన మాల్దీవుల ఎంపీ.. మోదీపై అలా, మంత్రిపై ఇలా!

India - Maldives Row: పర్యాటక రంగంలో తమకు తిరుగులేదన్న అహంకారంతో.. మాల్దీవుల నేతలు తమ గోతిని తామే తవ్వుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశంపై కించపరిచే వ్యాఖ్యలు చేసి.. సర్వత్రా విమర్శలు మూటగట్టుకుంటున్నారు. మాల్దీవుల్ని బాయ్‌కాట్ చేయాలనే దాకా వ్యవహారం వెళ్లింది. దీంతో.. మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేసింది. అలాగే.. ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటనపై నోరుపారేసుకున్న మాల్దీవుల ఎంపీ జాహిద్ రమీజ్‌కి కూడా గట్టిగానే క్లాస్ పీకినట్టు ఉంది. అందుకే.. తాను చేసిన తప్పుని సరిదద్దుకునే పనిలో ఆయన పడినట్టు తెలుస్తోంది. ఇందుకు తాజాగా రమీజ్ చేసిన ట్వీట్‌ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మేటర్ ఏమిటంటే..


భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈరోజు 69వ ఏటలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తింది. ప్రముఖ నేతలతో పాటు ఇతర సెలెబ్రిటీలు సైతం ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇలాంటి వారి జాబితాలో ఆ మాల్దీవుల ఎంపీ జాహిద్ రమీజ్ కూడా చేరిపోయారు. ఎక్స్ వేదికగా ఆయన జైశంకర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గౌరవనీయమైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్‌కి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పట్లాగే ఈ ఏడాదిలోనూ మీరు అన్నింటిలో విజయాలు సాధించాలి. అలాగే మీ దౌత్య ప్రయత్నాలు ఈ ఏడాది మొత్తం సానుకూలంగా సాగాలని కోరుకుంటున్నాను’’ అని జాహిద్ రమీజ్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు. దీంతో.. ఈ మంత్రి దారికొచ్చాడంటూ నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతకుముందు.. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై ఈ జాహిద్ రమీజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో తమతో పోటీపడలేరని, అక్కడి గదుల్లో వాసనే అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. ‘‘లక్షద్వీప్ టూరిజంని అభివృద్ధి చేయాలన్న ఎత్తుగడ నిజంగానే బాగింది. కానీ.. మాతో (మాల్దీవులు) పోటీ పడాలనే ఆలోచన మాత్రం భ్రమ కలిగించేదే. మేము అందించే సేవల్ని వాళ్లు ఎలా అందించగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య’’ అని ట్వీట్ చేశారు. ఇందుకు గాను జాహిద్‌పై తారాస్థాయిలో విమర్శలు వచ్చిపడ్డాయి.

Updated Date - Jan 09 , 2024 | 03:50 PM