Maharashtra: అన్నాహజారేను కలిసిన ఫడ్నవిస్
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:30 PM
ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అహల్యానగర్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆయనకు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ దగ్గరకు అన్నాహజారే వచ్చారు.

ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే (Anna Hazare)ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) కలుసుకున్నారు. అహల్యానగర్‌లో ముఖ్యమంత్రి ఆదివారంనాడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అన్నాహజారేను కలుసుకుని ముచ్చటించారు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అహల్యానగర్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆయనకు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ దగ్గరకు అన్నాహజారే వచ్చారు. రాలేగావ్ సిద్ధి రావలసిందిగా కూడా ఫడ్నవిస్‌ను అన్నాహజారే ఆహ్వానించారు.
Mallikarjun Kharge: ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర: ఖర్గే
ఆశీస్సులు తీసుకున్నా..
ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మభూషణ్ అన్నాహజారేను ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని దేవేంద్ర ఫడ్నవిస్ సామాజిక మాధ్యమం "ఎక్స్''లో తెలిపారు. హజారే ఎంతో ఆప్యాయంగా తనకు ఆశీస్సులు అదించారని కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు మంత్రి రాధాకృష్ణ, విఖే పాటిల్ సైతం ఈ పర్యటనలో పాల్గొన్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Arvind Kejriwal: మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన రిజిస్ట్రేషన్ ఎప్పట్నించంటే
Delhi: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. దొరికిపోయిన విద్యార్థులు
Rains: 25నుంచి మళ్లీ కుండపోత వర్షాలు..
For National News And Telugu News