Share News

Lok Sabha Elections 2024: రెండో విడతలో సాయంత్రం 5 గంటల వరకూ 61 శాతం పోలింగ్

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:39 PM

లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో ఓటర్లు చురుకుగా పాల్గొన్నారు. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ 61 శాతం పోలింగ్ నమోదైంది. త్రిపురలో గరిష్టంగా 76.23 శాతం పోలింగ్ నమోదైంది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కనిష్టంగా 52.64 శాతం నమోదైంది.

Lok Sabha Elections 2024: రెండో విడతలో సాయంత్రం 5 గంటల వరకూ 61 శాతం పోలింగ్

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) రెండో విడత (Second phase) పోలింగ్‌లో ఓటర్లు చురుకుగా పాల్గొన్నారు. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ సుమారు 61 శాతం పోలింగ్ నమోదైంది. త్రిపురలో గరిష్టంగా 76.23 శాతం పోలింగ్ నమోదైంది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కనిష్టంగా 52.64 శాతం నమోదైంది.

Lok Sabha polls 2024: అనంతనాగ్-రాజౌరి ఎన్నిక వాయిదా వద్దు.. ఈసీకి మాజీ సీఎంల లేఖ


ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం, అసోంలో 70.66 శాతం పోలింగ్ నమోదు కాగా, బీహార్‌లో 53.05 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 72.13, జమ్మూకశ్మీర్‌లో 67.22, కర్ణాటకలో 63.90, కేరళలో 63.97, మధ్యప్రదేశ్‌లో 54.42, మహారాష్ట్రలో 53.51, మణిపూర్‌లో 76.06, పశ్చిమబెంగాల్‌లో 71.84 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటలతో ముగియాల్సి ఉండగా, అప్పటికే క్యూలో ఉన్న వారికి కూడా ఓటు వేసే వీలు ఎన్నికల కమిషన్ కల్పించింది. కాగా, తదుపరి విడత (మూడో విడత) పోలింగ్ మే 7న జరుగనుంది. చివరి విడత జూన్ 1న జరుగనుండగా, జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 06:46 PM