Share News

Leader of the Opposition: సీఎం వద్ద స్టీరింగ్‌.. బ్రేక్‌ డీసీఎం చెంత.. క్లచ్‌ రాజణ్ణ వద్దే

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:35 PM

సీఎం సిద్దరామయ్య వద్ద స్టీరింగ్‌ మాత్రమే ఉందని బ్రేక్‌ డీసీఎం డీకే శివకుమార్‌, క్లచ్‌ మంత్రి రాజణ్ణ వద్ద ఉందని విధానపరిషత్‌ ప్రతిపక్షనేత కోటా శ్రీనివాసపూజారి(Kota Srinivasa Pujari) కాంగ్రెస్‌ పాలనను బస్సుతో పోల్చారు.

Leader of the Opposition: సీఎం వద్ద స్టీరింగ్‌.. బ్రేక్‌ డీసీఎం చెంత.. క్లచ్‌ రాజణ్ణ వద్దే

- ప్రతిపక్షనేత కోటా శ్రీనివాసపూజారి ఎద్దేవా..

బెంగళూరు: సీఎం సిద్దరామయ్య వద్ద స్టీరింగ్‌ మాత్రమే ఉందని బ్రేక్‌ డీసీఎం డీకే శివకుమార్‌, క్లచ్‌ మంత్రి రాజణ్ణ వద్ద ఉందని విధానపరిషత్‌ ప్రతిపక్షనేత కోటా శ్రీనివాసపూజారి(Kota Srinivasa Pujari) కాంగ్రెస్‌ పాలనను బస్సుతో పోల్చారు. సోమవారం పరిషత్‌లో కోటా మాట్లాడుతూ 135మంది మద్దతు ఉందని, పాలనా అనుభవం ఉన్న సీఎం వద్ద స్టీరింగ్‌ కూడా బాగుందని అయితే ఏం లాభ మని ప్రశ్నించారు. బ్రేక్‌లు మాత్రం ఆయన వద్ద లేవన్నారు. బస్సు అప్పగించే వేళ నీకు ఎప్పుడు బ్రేక్‌ వేయాలో నాకు తెలుసనేలా డీసీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. క్లచ్‌ రాజణ్ణ వద్ద ఉందని, ఎక్సలేటర్‌ పెంచాలని ప్రయత్నిస్తే మునియప్ప, మహ దేవప్పల వద్ద ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇదే సందర్భంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి సుధాకర్‌ జోక్యం చేసుకుని మీరు అన్ని బాధ్యతలు ఢిల్లీ వద్ద ఉంచి వచ్చారంటూ ఎద్దేవాచేశారు.

Updated Date - Feb 20 , 2024 | 12:35 PM