Share News

Budget 2024: 'జీడీపీ'కి కొత్త అర్థం చెప్పాం: నిర్మలా సీతారామన్

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:26 PM

జీడీపీ అంటే గవర్నెన్స్, డవలప్‌మెంట్, పెర్ఫార్మెన్స్ అనే కొత్త అర్థాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, ఆ దిశగా ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024-25 తాత్కాలిక బడ్జెట్ ను లోక్‌సభలో ప్రవేశపెడుతూ, పేదలు, మహిళలు, యువత, అన్నదాతల స్థితిగతులను మెరుగుపరచేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.

Budget 2024: 'జీడీపీ'కి  కొత్త అర్థం చెప్పాం: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: జీడీపీ (GDP) అంటే గవర్నెన్స్, డవలప్‌మెంట్, పెర్ఫార్మెన్స్ అనే కొత్త అర్థాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, ఆ దిశగా ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తెలిపారు. 2024-25 తాత్కాలిక బడ్జెట్ (Union Budget)ను లోక్‌సభలో ప్రవేశపెడుతూ, పేదలు, మహిళలు, యువత, అన్నదాతల స్థితిగతులను మెరుగుపరచేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.


ప్రసంగంలో ముఖ్యాంశాలు..

-ప్రభుత్వం గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చాం.

-పంట బీమా పథకం వల్ల 40 మిలియన్ల మంది రైతులు ప్రయోజనం పొందారు.

-పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచాం. ఆర్థిక వృద్ధి పుంజుకుంది.

-పన్ను సంస్కరణలతో టాక్స్ బేస్‌ను విస్తరించాం. పన్ను వసూళ్లు పెరిగాయి.

-రాబోయే ఐదేళ్లలో అసాధారణ రీతిలో ఆర్థిక వృద్ధి చోటుచేసుకోనుంది.

-2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నాం.

-రక్షణ ప్రయోజనల రీత్యా డీప్ టెక్‌ను పటిష్టం చేసేందుకు ఒక కొత్త పథకాన్ని తెస్తున్నాం.

-మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేస్తాం. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం.

-స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు.

-లక్ పతీ దీదీ టార్గెట్‌ను రెండు నుంచి మూడు కోట్లకు పెంచుతున్నాం.

Updated Date - Feb 01 , 2024 | 12:28 PM