Share News

Kerala Government: లింగ సమానత్వంపై పిల్లలకు పాఠాలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:02 AM

విద్యార్థి దశ నుంచే లింగ సమానత్వ భావనను బలంగా నాటేందుకు కేరళ ప్రభుత్వం ముందడుగు వేసింది. పాఠ్యపుస్తకాల్లో లింగ సమానత్వాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. వేసవి సెలవుల విరామం అనంతరం సోమవారం నుంచి కేరళలో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన పాఠ్యపుస్తకాల్లో వంట, ఇతర ఇంటి పనుల్లో లింగ భేదానికి తావులేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి అన్నిపనులూ చేస్తున్న చిత్రం అందరినీ విశేషంగా ఆకర్షించింది.

 Kerala Government: లింగ సమానత్వంపై పిల్లలకు పాఠాలు

  • పాఠ్యపుస్తకాల్లో చేర్చిన కేరళ సర్కారు

తిరువనంతపురం, జూన్‌ 7: విద్యార్థి దశ నుంచే లింగ సమానత్వ భావనను బలంగా నాటేందుకు కేరళ ప్రభుత్వం ముందడుగు వేసింది. పాఠ్యపుస్తకాల్లో లింగ సమానత్వాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. వేసవి సెలవుల విరామం అనంతరం సోమవారం నుంచి కేరళలో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన పాఠ్యపుస్తకాల్లో వంట, ఇతర ఇంటి పనుల్లో లింగ భేదానికి తావులేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి అన్నిపనులూ చేస్తున్న చిత్రం అందరినీ విశేషంగా ఆకర్షించింది.

మళయాళం మీడియం మూడో తరగతి పాఠ్యపుస్తకంలో లింగ సమానత్వాన్ని సూచిస్తున్న పాఠంలోని ఈ చిత్రాన్ని విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఇది వైరల్‌ అయింది. దీనిలో తండ్రి వంటగదిలో కూర్చుని కొబ్బరి తురుముతుంటే.. తల్లి వంట చేస్తూ కనిపించింది. ఇక ఇంగ్లిష్‌ కేరళ ప్రభుత్వం ఇలా పాఠ్యపుస్తకాల్లో పొందుపర్చిన లింగ సమానత్వం భావనను ఉపాధ్యాయులు, విద్యార్థులు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. కాగా విద్యార్థులు రేబిస్‌ వ్యాధి బారిన పడకుండా నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాఠశాల ఆవరణలో వీధి కుక్కలు ఉండకుండా, అక్కడ అవి సంతానోత్పత్తి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి నేతృత్వంలోని విద్యాశాఖ శుక్రవారం మార్గదర్శకాలు జారీచేసింది.

Updated Date - Jun 08 , 2024 | 07:03 AM