Share News

Charith Ballappa: సహనటికి లైంగిక వేధింపులు.. కన్నడ టీవీ నటుడు చరిత్‌ అరెస్టు

ABN , Publish Date - Dec 29 , 2024 | 03:42 AM

కన్నడ టీవీ నాటికల్లో ప్రముఖ నటుడు చరిత్‌ బాలప్ప శుక్రవారం అరెస్టు అయ్యాడు. సహ నటిని లైంగిక వేధింపులకు గురి చేయడం, మాట వినకుంటే చంపేస్తానని బెదిరించాడనే ఆరోపణలపై బెంగళూరులోని రాజేశ్వరీ పేట పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Charith Ballappa: సహనటికి లైంగిక వేధింపులు.. కన్నడ టీవీ నటుడు చరిత్‌ అరెస్టు

బెంగళూరు, డిసెంబరు 28: కన్నడ టీవీ నాటికల్లో ప్రముఖ నటుడు చరిత్‌ బాలప్ప శుక్రవారం అరెస్టు అయ్యాడు. సహ నటిని లైంగిక వేధింపులకు గురి చేయడం, మాట వినకుంటే చంపేస్తానని బెదిరించాడనే ఆరోపణలపై బెంగళూరులోని రాజేశ్వరీ పేట పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కన్నడలో ముద్దు లక్ష్మి అనే నాటికతో పేరొందిన చరిత్‌.. పలు తెలుగు నాటికల్లోనూ నటించాడు. కన్నడ, తెలుగు నాటికల్లో నటించే ఓ నటి(29) బాలప్ప తనని వేధిస్తున్నాడంటూ డిసెంబరు 13న పోలీసులను ఆశ్రయించింది. చరిత్‌ ప్రేమ పేరుతో తనకు దగ్గరై బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. కాగా, చరిత్‌కు ఇది వరకే వివాహమవ్వగా న్యాయస్థానం ద్వారా భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. భరణం కోసం నోటీసులు పంపిన మాజీ భార్యను చరిత్‌ బెదిరించడంతో జూన్‌లో ఆయనపై ఓ కేసు నమోదైంది.

Updated Date - Dec 29 , 2024 | 03:42 AM