Share News

Electoral bonds: ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చెల్లుబాటు అవుతుందా?.. నేడు సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

ABN , Publish Date - Feb 15 , 2024 | 10:34 AM

రాజకీయ పార్టీ విరాళాల సేకరణ కోసం అధికారికంగా ఉపయోగిస్తున్న ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటు అవుతుందా?.. ఈ స్కీమ్ చట్టబద్ధమేనా?.. అనేది నేడు సుప్రీంకోర్టు తేల్చనుంది. ఈ మేరకు గురువారం కీలకమైన తీర్పు వెలువరించనుంది. ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.

Electoral bonds: ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చెల్లుబాటు అవుతుందా?.. నేడు సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీ విరాళాల సేకరణ కోసం అధికారికంగా ఉపయోగిస్తున్న ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటు అవుతుందా?.. ఈ స్కీమ్ చట్టబద్ధమేనా?.. అనేది నేడు సుప్రీంకోర్టు తేల్చనుంది. ఈ మేరకు గురువారం కీలకమైన తీర్పు వెలువరించనుంది. ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వనుంది. కాంగ్రెస్ నాయకులు జయ ఠాకూర్‌తో పాటు సీపీఐ(ఎం), ఎన్‌జీవో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దాఖలు చేసిన నాలుగు వేర్వేరు పిటిషన్లపై గతేడాది అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఈ కేసు విచారణ ఇదివరకే పూర్తయినప్పటికీ తీర్పును రిజర్వ్ చేస్తూ నవంబర్ 2న కోర్ట్ నిర్ణయం తీసుకుంది.


కాగా ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను జనవరి 2, 2018న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు పారదర్శకత పద్ధతిలో నిధులు సేకరిస్తున్నాయి. పథకానికి సంబంధించిన రూల్స్ ప్రకారం.. ఏ భారత పౌరుడు లేదా స్థాపించబడిన సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. వ్యక్తిగతంగా లేదా కొంతమంది వ్యక్తుల సమూహం కలిసి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఏ కింద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించే వెసులుబాటు ఉంటుంది. అర్హత కలిగిన రాజకీయ పార్టీలు అధీకృత బ్యాంకు అకౌంట్ ద్వారా మాత్రమే విరాళాలను పొందాల్సి ఉంటుంది.

Updated Date - Feb 15 , 2024 | 10:34 AM