Share News

IRCTC Updates: ట్రైన్ టికెట్‌లో మీ పేరు తప్పు పడిందా? వెంటనే ఇలా చేయండి..

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:39 PM

మీ కుటుంబ సభ్యులు గానీ, బంధువుల పేర్లు గానీ ఎవరివైనా టికెట్‌లో తప్పుగా నమోదు అయ్యాయా? ఒకవేళ తప్పుగా బుక్ చేసుకుంటే ఏం చేయాలి? టికెట్‌లో పేరును ఎలా మార్చుకోవాలి? IRCTC టికెట్‌లో నేమ్ ఛేంజ్ ఎలా చేసుకోవాలని అని మదనపడుతున్నారా? మరేం పర్వాలేదు. పేరు తప్పు పడినా మార్చుకునే వెసులుబాటు ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC Updates: ట్రైన్ టికెట్‌లో మీ పేరు తప్పు పడిందా? వెంటనే ఇలా చేయండి..
IRCTC Tickets Update Process

న్యూఢిల్లీ, జనవరి 05: ట్రైన్ టికెట్‌లో మీ పేరు కానీ, మీ కుటుంబ సభ్యుల పేర్లు గానీ తప్పుగా నమోదయ్యాయా? ఒకవేళ తప్పుగా పడితే ఏం చేయాలి? టికెట్‌లో పేరును ఎలా సవరించుకోవాలి?.. అని మదనపడుతున్నారా? మరేం పర్వాలేదు. పేరు తప్పుగా పడినా దిద్దుబాటు చేసుకునే వెసులుబాటుని ఇండియన్ రైల్వేస్ కల్పిస్తోంది. ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం..

ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఎలా సవరించుకోవాలి?

ఒకవేళ టికెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నట్టయితే దానిని సవరించుకోవాలనుకుంటే సరైన ఆధారాలతో ఐఆర్‌సీటీసీ ( IRCTC) అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత ‘బోర్డింగ్ పాయింట్ అండ్ ప్రయాణీకులపేరు మార్పు’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ప్రత్యేక పేజీ ఓపెన్ అవుతుంది. అవసరమైన వివరాలను నింపి అదే ఫామ్‌ను అప్‌లోడ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా తప్పుగా పడిన పేర్లను సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఐఆర్‌సీటీసీ ఒక్కసారి మాత్రమే ఈ దిద్దుబాటు అవకాశం కల్పిస్తోంది.

రైల్వేస్టేషన్‌కు వెళ్లి సవరించుకోవాలనుకుంటే..

👉 ముందుగా టికెట్ టికెట్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

👉 మీ సమీప రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లండి.

👉 టికెట్‌లో ప్రయాణించే ఎవరైనా ప్రయాణీకుల ఒరిజినల్ ఐడి ప్రూఫ్‌తో పాటు దాని ఫోటోకాపీని తీసుకువెళ్లండి.

👉 టిక్కెట్‌లో ప్రయాణీకుడి పేరును మార్చమని కౌంటర్ అధికారిని అడగవచ్చు.

👉 సదరు అధికారి.. టికెట్‌లోని పొరపాట్లను సరిదిద్దుతారు.

గమనిక: ఈ సదుపాయాన్ని పొందేందుకు మీరు రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు రిజర్వేషన్ కార్యాలయాన్ని సందర్శించాలి. ఆ సమయం దాటితే.. దిద్దుబాటు సాధ్యం అవదు.


మీ టిక్కెట్టును మరొకరికి బదిలీ చేయడం ఎలా?

IRCTC ప్రయాణీకులు తమ టిక్కెట్లను తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త లేదా భార్యతో సహా కుటుంబ సభ్యునికి బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. ఇందుకోసం ప్రయాణికులు ఏం చేయాలో తెలుసుకుందాం..

ప్రయాణికులు టికెట్ ప్రింట్‌ను తీసుకెళ్లాలి. టికెట్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారి ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లి కౌంటర్ వద్ద సమర్పించాలి. రిజర్వేషన్ డెస్క్ వద్ద ఎవరి పేరు మీదకు టికెట్ మార్చాలనుకుంటున్నారో.. వారితో తమకున్న రక్త సంబంధానికి సంబంధించిన ప్రూఫ్‌ను సమర్పించాలి. ధృవపత్రాలన్నీ సరిగా ఉన్నట్లయితే.. అధికారులు టికెట్‌ను ఇతరుల పేరుకు మార్చేస్తారు.

ప్రయాణికులు ఎక్కువగా అడిగే ప్రశ్నలు.. వాటికి సమాధానాలు..

1. ధృవీకరించబడిన రైల్వే టిక్కెట్‌ను బదిలీ చేయడానికి నియమాలు ఏమిటి?

మీ టిక్కెట్‌ను బదిలీ చేయడానికి, మీరు రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందుగా మీ అభ్యర్థనను సమర్పించాలి. అయితే, రాయితీపై జారీ చేసిన టిక్కెట్లపై పేర్ల మార్పు అనుమతించడం జరుగదు.

3. రైల్వే టిక్కెట్‌లో మార్పులు చేయవచ్చా?

మీరు IRCTC నుండి కన్ఫర్మేషన్ పొందిన తరువాత.. మీరు మీ టిక్కెట్‌కి అవసరమైన మార్పులను చేయవచ్చు. ఇది IRCTC వెబ్‌సైట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా కస్టమర్ కేర్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా మార్పులు చేసుకోవచ్చు. మార్పులు చేయడానికి మీరు మీ టిక్కెట్ నంబర్, ఇమెయిల్‌ను అందించాల్సి ఉంటుంది.

4. IRCTC వాట్సాప్ నెంబర్ ఏంటి?

వాట్సాప్‌లో IRCTC పీఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ లైవ్ అప్‌డేట్ కోసం రైలు స్థితిని తెలుసుకోవడం కోసం రైల్వే శాఖ వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులో ఉంచింది. రైల్వే వాట్సాప్ చాట్‌బాట్ ఫోన్ నంబర్, +91-9881193322. దీనిని మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవచ్చు.

5. ఒక వ్యక్తి 2 IRCTC ఖాతాలను కలిగి ఉండవచ్చా?

IRCTC నియమం ప్రకారం.. ఒక మొబైల్ నెంబర్, ఒక ఇమెయిల్ ఐడితో ఒక ఖాతాను మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, మీరు IRCTCతో నమోదు చేయని రెండు వేర్వేరు ఇమెయిల్ ఐడిలు, మొబైల్ నంబర్‌లను ఉపయోగించి రెండు ఖాతాలను క్రియేట్ చేసుకోవచ్చు.

Updated Date - Jan 05 , 2024 | 01:59 PM