Share News

Israel-Iran conflict: దూసుకొచ్చిన డ్రోన్లను కూల్చేశామంటున్న ఇరాన్.. ఇజ్రాయెల్ నో కామెంట్స్!

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:49 AM

గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం తారస్థాయికి చేరుకున్నాయి. గత వారం ఇరాన్ చేసిన డ్రోన్, మిసైల్ దాడులకు తాజాగా ఇజ్రాయెల్ కూడా ప్రతి స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ నగరమైన ఇస్పాహన్ గగనతలంపై భారీ పేలుళ్లు సంభవించినట్టు వార్తలు వస్తున్నాయి.

Israel-Iran conflict: దూసుకొచ్చిన డ్రోన్లను కూల్చేశామంటున్న ఇరాన్.. ఇజ్రాయెల్ నో కామెంట్స్!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం

గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం తారస్థాయికి చేరుకున్నాయి (Israel-Iran conflict). గత వారం ఇరాన్ చేసిన డ్రోన్, మిసైల్ దాడులకు తాజాగా ఇజ్రాయెల్ కూడా ప్రతి స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ నగరమైన ఇస్పాహన్ (Isfahan) గగనతలంపై భారీ పేలుళ్లు సంభవించినట్టు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుఝామున ఇరాన్ అణు కార్యకలాపాలకు కేంద్రమైన ఇస్ఫహాన్‌పై ఇజ్రాయెల్ మిసైల్ దాడి (Missile attack) చేసినట్టు అమెరికా అనుమానిస్తోంది.


ఈ దాడుల గురించి తాజాగా ఇరాన్ స్పందించింది. తమ దేశంపై మిసైల్ ఎటాక్ జరగలేదని స్పష్టం చేసింది. అయితే కొన్ని డ్రోన్లను (Drones) మాత్రం కూల్చినట్టు తెలిపింది. ఇస్ఫహాన్ నగర సమీపంలో శుక్రవారం తెల్లవారుఝామున భారీ పేలుళ్లు వినిపించాయి. దీంతో ఇరాన్ వెంటనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసింది. ఇప్పటివరకు మూడు డ్రోన్లను కూల్చివేసినట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రంపై ఎలాంటి దాడీ జరగలేదని, తమ దేశంపై మిసైల్ ఎటాక్ జరిగినట్టు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని తెలిపారు.


ఇస్ఫాహన్ నగంలోనే ఇరాన్‌కు చెందిన అతిపెద్ద మిలిటరీ ఎయిర్ బేస్, అణు కేంద్రాలు ఉన్నాయి. దీంతో వీటిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడికి దిగిందని అమెరికా మీడియా వార్తలు వెలువరించింది. అయితే వార్తలపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించడం విశేషం. ``ప్రస్తుతానికి మేం ఏమీ మాట్లాడలేం`` అని ఇజ్రాయెల్ సైన్యం కామెంట్లు చేసింది. కాగా, రాబోయే 48 గంటల్లో ఇరాన్‌‌పై అమెరికా మిసైల్ దాడికి దిగొచ్చని అంతర్జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో షిహ్రాజ్, ఇరాన్ మీదుగా విమాన రాకపోకలను ఇరాన్ నిలిపేసింది.

Updated Date - Apr 19 , 2024 | 11:49 AM