Indian Railways: పీపీపీ విధానంలో కొత్త ప్రాజెక్టులు
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:15 AM
భారతీయ రైల్వేస్.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నూతన ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.
న్యూఢిల్లీ, డిసెంబరు 28: భారతీయ రైల్వేస్.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నూతన ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. రానున్న నెలల్లో ఈ విధానంలో భాగంగా మినరల్ కారిడార్లు వంటి నూతన వాణిజ్యపరమైన లైన్లను నిర్మించాలని ప్రతిపాదిస్తున్నట్టు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును తగ్గించుకోవా లన్న ఉద్దేశంతో భారతీయ రైల్వేస్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, పీపీపీ విధానం వైపు మారాలని ప్రతిపాదించినప్పటికీ 2025-26 బడ్జెట్‌లో మూలధన వ్యయానికి సంబంధించి భారీ ఊతాన్ని భారతీయ రైల్వేస్ పొందే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. కాగా 2031 నాటికి ప్రతిపాదిత ఇంధన, మైనింగ్, సిమెంట్ రైల్ కారిడార్లకు రూ.5.25 లక్షల కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా. మరోవైపు, రైళ్లకు సంబంధించిన కొత్త టైమ్ టేబుల్‌ను భారతీయ రైల్వేస్ వచ్చే జనవరి 1న విడుదల చేయనుంది.