Share News

Delhi: తప్పును అంగీకరించిన కేజ్రీవాల్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Feb 26 , 2024 | 04:10 PM

పరువు నష్టం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. యూట్యూబర్ ధ్రువ్ రాథీకి సంబంధించిన వీడియోను రీట్వీట్ చేసిన కేసులో కేజ్రీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు అధికారులను ఆదేశించింది.

Delhi: తప్పును అంగీకరించిన కేజ్రీవాల్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీ: పరువు నష్టం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. యూట్యూబర్ ధ్రువ్ రాథీకి సంబంధించిన వీడియోను రీట్వీట్ చేసిన కేసులో కేజ్రీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు అధికారులను ఆదేశించింది. యూట్యూబర్ ధ్రువ్ రాథీ 2018లో చేసిన ఓ యూట్యూబ్ వీడియోను కేజ్రీ రీట్వీట్ చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు షేర్ చేయడం కూడా నేరమే అవుతుందని వ్యాఖ్యానించింది.

ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లు కొట్టేయడానికి నిరాకరించింది. దీంతో కేజ్రీ సుప్రీంను (Supreme Court) ఆశ్రయించారు. సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా.. తాను అలా చేసి ఉండాల్సింది కాదని.. తప్పును అంగీకరించారు. అలా చేయడం పొరపాటని, కేసు మూసేయాలని ధర్మాసనాన్ని కోరారు. తప్పు ఒప్పుకున్నందున ముఖ్యమంత్రిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ట్రయల్ కోర్టును సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 04:32 PM