Share News

Delhi: స్త్రీ ధనంపై భర్తకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:04 AM

భార్యకు చెందిన స్త్రీ ధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దానిని తీసుకున్నా దానిని తిరిగి ఆమెకు చెల్లించాల్సిన నైతిక బాధ్యత ఆయనపై ఉందని తెలిపింది.

Delhi: స్త్రీ ధనంపై భర్తకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

  • అదేమీ ఉమ్మడి ఆస్తి కాదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: భార్య తీసుకొచ్చిన నగలను అమ్మేసినందుకు ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలని కేరళకు చెందిన ఓ వ్యక్తిని ఆదేశించింది. ఆ మహిళ 2009లో ఆ వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో 89 సవర్ల బంగారు నగలను తీసుకెళ్లింది. భర్త నగలను తీసుకున్నాడు. అమ్మేసి అప్పు కట్టాడు. అనంతరం గొడవలు రావడంతో భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.


భర్త, అత్త కలిసి తన నగలు అమ్మేశారని, వాటిని ఇప్పించాలని కోరింది. ఆమెకు అనుకూలంగా 2011లో ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై అతడు హైకోర్టులో అప్పీలు చేశాడు. బంగారాన్ని అమ్మేసినట్టు ఆమె నిరూపించలేకపోవడంతో దాన్ని ఇవ్వాల్సిన పనిలేదని తెలిపింది.

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మళ్లీ సదరు భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. స్త్రీ ధనం భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదని, దీనిపై భర్తకు హక్కు ఉండదని స్పష్టం చేసింది.

Updated Date - Apr 27 , 2024 | 04:04 AM