Share News

Washington: గోల్డీబ్రార్‌ బతికే ఉన్నాడు: అమెరికా పోలీసులు

ABN , Publish Date - May 03 , 2024 | 03:32 AM

పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌, నిషేధిత ఖలిస్థానీ వేర్పాటు సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన ఉగ్రవాది గోల్డీబ్రార్‌ బతికే ఉన్నట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు.

Washington: గోల్డీబ్రార్‌ బతికే ఉన్నాడు: అమెరికా పోలీసులు

వాషింగ్టన్‌, మే 2: పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌, నిషేధిత ఖలిస్థానీ వేర్పాటు సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన ఉగ్రవాది గోల్డీబ్రార్‌ బతికే ఉన్నట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం కాలిఫోర్నియాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి పేరు జేవియర్‌ గాల్ద్నే(37) అని వివరించారు.


అసలు గోల్డీబ్రార్‌ చనిపోయాడనే ప్రచారం స్థానిక మీడియాలో ఎలా జరిగిందో తెలియదని, ఈ అంశంపై తమకు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయని ఫ్రెస్నో పోలీసు విభాగం అధికారి లెఫ్టినెంట్‌ పాల్‌ సెర్వాంటెస్‌ వివరించారు. ఈ ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తిని డారెన్‌ విలియ మ్స్‌ అనే 33 ఏళ్ల యువకుడిగా డిటెక్టివ్‌ విభాగం గుర్తించినట్లు చెప్పారు.

Updated Date - May 03 , 2024 | 06:49 AM