Share News

Lok Sabha polls 2024: గులాం నబీ ఆజాద్ షాకింగ్ నిర్ణయం.. ఎన్నికల్లో పోటీకి దూరం

ABN , Publish Date - Apr 17 , 2024 | 08:35 PM

డెమోక్రాటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించారు. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ సీటుకు తన అభ్యర్థిత్వాన్ని ఆయన ఉపసంహరించుకున్నారు.

Lok Sabha polls 2024: గులాం నబీ ఆజాద్ షాకింగ్ నిర్ణయం.. ఎన్నికల్లో పోటీకి దూరం

కశ్మీర్: డెమోక్రాటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేయరాదని నిర్ణయించారు. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ సీటుకు తన అభ్యర్థిత్వాన్ని ఆయన ఉపసంహరించుకున్నారు. దీంతో అనంతనాగ్-రాజౌరీ సీటు నుంచి డీపీఏపీ అభ్యర్థిగా మొహమ్మద్ సలీమ్ పరే పోటీలో ఉంటారు. ఈ విషయాన్ని డీపీఏపీ కశ్మీర్ ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ మహమ్మద్ అమీన్ భట్ ధ్రువీకరించారు.

Election commission: పోలింగ్ రోజు పర్యటన.. బెంగాల్ గవర్నర్‌కు ఈసీ బ్రేక్..


లోక్‌సభ ఎన్నికల్లో ఆజాద్ పోటీ చేయడం లేదని, ఆజాద్‌తో జరిగిన సమావేశంలో అడ్వకేట్ సలీమ్ పరేను అనంతనాగ్-రాజౌరి సీటులో డీపీఏపీ అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించడం జరిగిందని అమీన్ భట్ తెలిపారు. కాగా, అనంతనాగ్-రాజౌరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత మియాన్ అల్టాఫ్ పోటీలో ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఐదు దశల్లో ఎన్నికలు జరుగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. ఒకే పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్న లడఖ్‌లో మే 20న పోలింగ్ జరుగనుంది.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 17 , 2024 | 08:41 PM