Share News

Savitri Jindal: కాంగ్రెస్ పార్టీకి సావిత్రి జిందాల్ రాజీనామా

ABN , Publish Date - Mar 28 , 2024 | 03:37 PM

హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హిస్సార్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ.. దశాబ్దం పాటు ప్రజలకు సేవా చేశానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

Savitri Jindal: కాంగ్రెస్ పార్టీకి సావిత్రి జిందాల్ రాజీనామా

హర్యానా, మార్చి28: హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ (Savitri Jindal)కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హిస్సార్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ.. దశాబ్దం పాటు ప్రజలకు సేవా చేశానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. హిస్సార్ నియోజకవర్గ ప్రజలు తన కుటుంబ సభ్యులని చెప్పారు. నా కుటుంబ సభ్యుల సలహా మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సావిత్రి జిందాల్ ప్రకటించారు.

భుపేంద్ర సింగ్ హుడా కేబినెట్‌లో సావిత్రి జిందాల్ మంత్రిగా పని చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి డాక్టర్ కమల్ గుప్తా చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన నయాబ్ సింగ్ సైనీ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ఇండియా ఈ ఏడాది ప్రకటించిన.. దేశంలో 10 మంది అత్యంత సంపన్న మహిళల్లో సావిత్రి జిందాల్ చోటు సంపాదించారు. సావిత్రి జిందాల్ మొత్తం ఆస్తి విలువ రూ. 2.42 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి ఓపి జందాల్ (OP Jindal) భార్యే సావిత్రి జిందాల్. వీరి కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాలు.. గత ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన వికసిత భారత్‌లో తన వంతుగా సహకరిస్తానని ఆయన ప్రకటించిన విషయం విధితమే. నవీన్ జిందాల్‌కు కురుక్షేత్ర (Kurukshetra) లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించింది. దాంతో ప్రస్తుతం ఆయన కురుక్షేత్రలో ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు.

మరిన్నిీ జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విద్యార్థిపై సహచర విద్యార్థుల దాడి

రంగంలోకి సానియా మిర్జా..!

Updated Date - Mar 28 , 2024 | 04:03 PM