Share News

Uttar Pradesh: అలీగఢ్‌ వర్సిటీకి మహిళా వీసీ..

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:51 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం వర్సిటీ వీసీగా నైమా ఖాతూన్‌ నియమితులయ్యారు. వందేళ్ల చరిత్రలో ఈ వర్సిటీకి మహిళా వీసీని నియమించడం ఇదే తొలిసారి.

Uttar Pradesh: అలీగఢ్‌ వర్సిటీకి మహిళా వీసీ..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం వర్సిటీ వీసీగా నైమా ఖాతూన్‌ నియమితులయ్యారు. వందేళ్ల చరిత్రలో ఈ వర్సిటీకి మహిళా వీసీని నియమించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ఆమోదం అనంతరం విద్యాశాఖ ఈ నియామకం చేపట్టినట్లు అధికారులు సోమవారం తెలిపారు.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఈ నియామకానికి ఎన్నికల సంఘం అనుమతి కూడా తీసుకున్నారు. ఇదే యూనివర్సిటీలో మహిళా కళాశాల ప్రిన్స్‌పాల్‌గా ఉన్న నైమా ఖాతూన్‌ ఐదేళ్ల పాటు వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేస్తారు. 1875లో ఏర్పాటైన మహమ్మదన్‌ ఆంగ్లో ఓరియంటల్‌ కళాశాలే 1920లో అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీగా మారింది. అప్పుడు బేగం సుల్తాన్‌ జహాన్‌ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు.

Updated Date - Apr 24 , 2024 | 06:31 AM