Share News

Lok Sabha Elections 2024: ప్రతి బూత్‌లోనూ నీళ్లు, టాయిలెట్, వీల్‌చైర్ సదుపాయాలు: సీఈసీ

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:12 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఓటరుకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలింగ్ ‌బూత్‌లలో అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తాగునీరు, టాయిలెట్లు, వీల్‌చైర్‌లు, ర్యాంప్ వంటి సదుపాయాలు ఉంటాయని చెప్పారు.

Lok Sabha Elections 2024: ప్రతి బూత్‌లోనూ నీళ్లు, టాయిలెట్, వీల్‌చైర్ సదుపాయాలు: సీఈసీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ఓటరుకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలింగ్ ‌బూత్‌లలో అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తాగునీరు, టాయిలెట్లు, వీల్‌చైర్‌లు, ర్యాంప్ వంటి సదుపాయాలు ఉంటాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, వీటన్నింటిలో ఓటర్ ఫెలిసిటేషన్ సెంటర్, హెల్ప్‌డెస్క్, సిగ్నేజ్, షెడ్, తగిన లైటింగ్ సౌకర్యం ఉంటుందని, కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు సులువుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. సులభతరమైన ఓటింగ్ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకంటామని తెలిపారు. 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈసారి ఉపయోగించుకోనున్నారని, ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛగా, సజావుగా జరిపేందుకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని చెప్పారు. లోక్‌సభ‌తో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ శనివారంనాడు ప్రకటించింది.

Updated Date - Mar 16 , 2024 | 04:12 PM