Share News

ETS: ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్‌ స్కోర్లు..

ABN , Publish Date - May 07 , 2024 | 04:07 AM

అన్ని రకాల ఆస్ట్రేలియా వీసాలకు ఇక నుంచి ఆంగ్ల భాషా పరీక్ష ‘టోఫెల్‌’ స్కోరును పరిగణనలోకి తీసుకుంటామని ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసు (ఈటీఎస్‌) సోమవారం ప్రకటించింది.

ETS: ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్‌ స్కోర్లు..

న్యూఢిల్లీ, మే 6: అన్ని రకాల ఆస్ట్రేలియా వీసాలకు ఇక నుంచి ఆంగ్ల భాషా పరీక్ష ‘టోఫెల్‌’ స్కోరును పరిగణనలోకి తీసుకుంటామని ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసు (ఈటీఎస్‌) సోమవారం ప్రకటించింది. ఈనెల 5న లేదా ఆ తర్వాత నుంచి నిర్వహించిన టోఫెల్‌ పరీక్షల స్కోర్లు మాత్రమే వీసాల జారీ విషయంలో చెల్లుబాటు అవుతాయని వివరించింది. టోఫెల్‌ అనేది ఇంగ్లిష్‌ మాట్లాడే దేశాల్లోని విశ్వ విద్యాలయాల్లో చేరాలనుకునే స్థానికేతరులకు వారి ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు నిర్వహించే ప్రామాణిక పరీక్ష. దీన్ని 160 కంటే ఎక్కువ దేశాల్లోని వర్సిటీలు ఆమోదించాయి.

Updated Date - May 07 , 2024 | 04:07 AM