Share News

J&K Elections: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎపుడో చెప్పిన సీఈసీ

ABN , Publish Date - Mar 16 , 2024 | 07:21 PM

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‍ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శనివారంనాడు ప్రకటించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ .. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

J&K Elections: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎపుడో చెప్పిన సీఈసీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections-2024)తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‍ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శనివారంనాడు ప్రకటించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అందుకు ఎన్నికల కమిషన్ కట్టుబడి ఉందని చెప్పారు.


''2019లో జమ్మూకశ్మీర్ రీఆర్గనేజేషన్ చట్టం ఆమోదం పొందింది. 17 సీట్లకు ప్రొవిజన్ ఉంది. వాటిలో 24 సీట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నారు. దాంతో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ముందుకు వచ్చింది, సీట్లలో మార్పు వచ్చింది. 2023 డిసెంబర్ 23న జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టం సవరణ జరిగింది. అప్పట్నించి మా పని మొదలైంది'' అని కుమార్ చెప్పారు.


పార్లమెంటు ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరపాలని జమ్మూకశ్మీర్‌లోని పార్టీలన్నీ కోరాయని, అయితే ఏకకాలంలో ఎన్నికలు జరపలేమని అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం కరాఖండిగా చెప్పిందన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 10 నుంచి 12 మంది అభ్యర్థులు ఉండగా, ఆ ప్రకారం 1,000 మంది అభ్యర్థులు బరిలో ఉంటారని, ప్రతి ఒక్క అభ్యర్థికి సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుందని, ప్రస్తుత పరిస్థితిలో ఇది సాధ్యం కాదని సీఈసీ వివరించారు.


జమ్మూకశ్మీర్‌ లోక్‌సభ స్థానాలకు..

కాగా, జమ్మూకశ్మీర్‌లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదంపూర్, జమ్మూలో ఏప్రిల్ 19, 26 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. మే 7న అనంతనాగ్-రాజౌరీలో, మే 13న శ్రీనగర్‌లో, మే 20న బారాముల్లాలో పోలింగ్ ఉంటుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Updated Date - Mar 16 , 2024 | 07:21 PM