Share News

Dog bite: ఆరేళ్లలో 44 లక్షల మందికి కుక్కకాటు

ABN , Publish Date - Jan 02 , 2024 | 09:08 AM

రాష్ట్రంలో ఆరేళ్లలో పిచ్చికుక్క కాటుకు 44 లక్షల మంది గురైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రేబిస్‌ వ్యాధి టీకాల ద్వారా నిరోధించగలిగే జినోటిక్‌ వైరస్‌ అని, ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని, ప్రపంచస్థాయిలో

Dog bite: ఆరేళ్లలో 44 లక్షల మందికి కుక్కకాటు

ఐసిఎఫ్‌(చెన్నై): రాష్ట్రంలో ఆరేళ్లలో పిచ్చికుక్క కాటుకు 44 లక్షల మంది గురైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రేబిస్‌ వ్యాధి టీకాల ద్వారా నిరోధించగలిగే జినోటిక్‌ వైరస్‌ అని, ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని, ప్రపంచస్థాయిలో 150 దేశాల్లో 59 వేల మంది మరణించారని తెలిపారు. అందులో మూడు వంతుల్లో ఒక భాగం భారతదేశంలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 2022లో మాత్రమే 8.83 లక్షల మంది కుక్కకాటుకు గురికాగా, 2018-23 వరకు 44,10,964 మంది కుక్కకాటుకు గురయ్యారని తెలిపారు. అలాగే, 2018-22 వరకు రేబిస్‌ వ్యాధితో 129 మంది మృతి చెందారన్నారు. స్థానిక స్టాన్లీ, రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాసుపత్రుల్లో 6,000 మంది చికిత్సలు పొందారని, 2030 నాటికి రాబిస్‌(Rabies) రహిత తమిళనాడుగా మార్చేందుకు చర్యలు చేడతామని అధికారులు తెలిపారు. కుక్క కరిచిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, గాయమైన ప్రాంతాన్ని 15 నిమిషాలు సబ్బుతో శుభ్రం చేయాలని, దీని ద్వారా 80 శాతం రేబిస్‌ వైరస్‌ నిర్మూలించబడుతుందన్నారు. వైద్యుల సలహా మేరకు టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని, ఎలాంటి మూలికలు, సొంత వైద్యం పనికిరాదని పేర్కొన్నారు.

Updated Date - Jan 02 , 2024 | 09:08 AM