Share News

Delhi: వణుకుతున్న దేశ రాజధాని.. సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

ABN , Publish Date - Jan 13 , 2024 | 10:16 AM

దేశ రాజధాని ప్రజలు తీవ్రమైన చలి(Winter Season)తో వణుకుతున్నారు. ఈ సీజన్ లో శనివారం ఉదయం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఇవాళ నమోదైంది. శుక్రవారం రాత్రి ఢిల్లీలో 3.8 డిగ్రీల చలితో ప్రజలు వణికిపోయారు.

Delhi: వణుకుతున్న దేశ రాజధాని.. సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

ఢిల్లీ: దేశ రాజధాని ప్రజలు తీవ్రమైన చలి(Winter Season)తో వణుకుతున్నారు. ఈ సీజన్ లో శనివారం ఉదయం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఇవాళ నమోదైంది. శుక్రవారం రాత్రి ఢిల్లీలో 3.8 డిగ్రీల చలితో ప్రజలు వణికిపోయారు. ఢిల్లీ - ఎన్ సీఆర్(Delhi - NCR) పరిధిలో చలి, దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 200 మీటర్ల దూరం వరకు ఏవీ కనిపించటంలేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పొగమంచు కారణంగా 18 రైళ్లు 6 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చలి, పొగమంచు కారణంగా పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌లలో రెడ్‌ అలర్ట్‌, రాజస్థాన్‌లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది. దేశ రాజధానిలో చలిగాలులు తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోవడంతో వాతావరణ శాఖ రానున్న 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Updated Date - Jan 13 , 2024 | 10:18 AM