Delhi : బీఎస్ఎఫ్ తాత్కాలిక డీజీగా దల్జిత్ సింగ్ చౌధరి
ABN , Publish Date - Aug 04 , 2024 | 05:13 AM
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎ్‌సఎఫ్) తాత్కాలిక డైరెక్టర్ జనరల్‌గా దల్జీత్ సింగ్ చౌధరిని నియమిస్తూ శనివారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎ్‌సబీ)కి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎ్‌సఎఫ్) తాత్కాలిక డైరెక్టర్ జనరల్‌గా దల్జీత్ సింగ్ చౌధరిని నియమిస్తూ శనివారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎ్‌సబీ)కి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు.
శాశ్వత ప్రాతిదికన డైరెక్టర్ జనరల్‌ను నియమించే వరకుగానీ, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకుగానీ కేంద్ర ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయని హోం శాఖ అండర్ సెక్రటరీ సంజీవ్ కుమార్ తెలిపారు. దల్జీత్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొన్నారు. ఇంతవరకు బీఎ్‌సఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన నితిన్ అగర్వాల్‌ను శుక్రవారమే అర్ధాంతరంగా తొలగించి సొంత కేడర్ అయిన కేరళకు పంపించింది. జమ్మూ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదుల దుశ్చర్యలు పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకొంది.