Share News

పంజాబ్‌లో 13 స్థానాల్లో గెలిపించండి : కేజ్రీవాల్‌

ABN , Publish Date - May 27 , 2024 | 04:27 AM

స్వాతంత్య్ర పోరాటంలో పంజాబ్‌ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎందరో ప్రాణత్యాగం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ గుర్తుచేశారు.

పంజాబ్‌లో 13 స్థానాల్లో గెలిపించండి : కేజ్రీవాల్‌

చండీగఢ్‌, మే 26: స్వాతంత్య్ర పోరాటంలో పంజాబ్‌ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎందరో ప్రాణత్యాగం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని వాటిని రక్షించేందుకు పంజాబ్‌ పౌరులు ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు.

ఫిరోజ్‌పూర్‌లో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో ‘ఆప్‌’ సంపూర్ణ మెజార్టీ కలిగి ఉన్నప్పటికీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆపుతున్నారని, 13 ఎంపీ స్థానాల్లో గనక విజయం సాధిస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని, సమర్ధంగా కేంద్రాన్ని ఎదుర్కొవచ్చని పేరొన్నారు.

Updated Date - May 27 , 2024 | 04:29 AM