Delhi Blast: ఢిల్లీలో పేలుడు.. హైటెన్షన్
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:38 PM
ఢిల్లీలో పేలుడు జరిగింది. ప్రశాంత్ విహార్‌లో స్వీట్ దుకాణం వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఘటన స్థలంలో తెల్లని పౌడర్ ను పోలీసులు గుర్తించారు.

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు జరిగింది. రద్దీగా ఉండే ప్రశాంత్ విహార్‌లో ఓ స్వీట్ షాప్ వద్ద బాంబు పేలింది. పీవీఆర్ మల్టీఫ్లెక్స్ సమీపంలో పేలుడు జరగడం తీవ్ర కలకలం రేపింది. పేలుడు సమాచారంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో తెల్లని పౌడర్ ను పోలీసులు గుర్తించారు. ఉదయం 11.48 గంటలకు పేలుడు జరగడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడుతో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ఆటో పార్క్ చేసిన డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు వివరించారు. పేలుడు జరిగిన తర్వాత ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ఏరియాను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. పేలుడుకు గల కారణం ఏంటి అని లోతుగా విచారిస్తున్నారు.