Share News

Delhi: ప్లేస్‌మెంట్ల కోసం ప్రత్యేక పోర్టల్‌..

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:18 AM

విద్యార్థులకు ఉద్యోగాల విషయమై మార్గదర్శనం చేసేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుయేషన్‌-ఏఐసీటీఈ) ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందించింది.

Delhi: ప్లేస్‌మెంట్ల కోసం ప్రత్యేక పోర్టల్‌..

  • 30న ప్రారంభం.. ఏఐసీటీఈ, అప్నా.కో సంయుక్తంగా రూపకల్పన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25: విద్యార్థులకు ఉద్యోగాల విషయమై మార్గదర్శనం చేసేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుయేషన్‌-ఏఐసీటీఈ) ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందించింది. ఏఐసీటీఈ కేరీర్‌ పోర్టల్‌ పేరుతో రూపొందించిన ఈ సాంకేతిక వేదికను ఈ నెల 30న ఆవిష్కరించనుంది.


ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫారం అయిన అప్నా.కో భాగస్వామ్యంతో దీన్ని రూపొందించింది. సుమారు 30 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగ, ఇంటర్న్‌షిప్‌ సదుపాయాలను చూపించడం ఈ పోర్టల్‌ లక్ష్యం. ప్లేస్‌మెంట్‌ల విషయంలో 12వేల కళాశాలలకు మార్గదర్శనం చేయనుంది. ప్రధాన కంపెనీలతో సంబంధాలు పెంచుకోవడానికి కూడా ఈ పోర్టల్‌ ఉపకరిస్తుందని ఏఐసీటీఈ చైర్మన్‌ టి.జి.సీతారాం చెప్పారు.


విద్యార్థులు సిలికాన్‌ వ్యాలీ ఇమ్మెర్సన్‌ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రాం కింద విద్యార్థులు అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీకి వెళ్లి గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ వంటి కంపెనీల ప్రముఖులను కలిసే అవకాశం ఉంటుంది.

Updated Date - Apr 26 , 2024 | 05:18 AM