Share News

Dawood Ibrahim: ఆస్తుల వేలానికి భారీ డిమాండ్.. ప్లాట్‌‌కు రూ.2 కోట్లు

ABN , Publish Date - Jan 05 , 2024 | 05:50 PM

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలానికి మంచి స్పందన వచ్చింది. ఆస్తులను చేజిక్కించుకునేందుకు చాలామంది ప్రయత్నించారు.

 Dawood Ibrahim: ఆస్తుల వేలానికి భారీ డిమాండ్.. ప్లాట్‌‌కు రూ.2 కోట్లు

రత్నగిరి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) ఆస్తుల వేలానికి మంచి స్పందన వచ్చింది. ఆస్తులను చేజిక్కించుకునేందుకు చాలామంది ప్రయత్నించారు. మహారాష్ట్ర (Maharashtra) రత్నగిరిలో గల ముంబెకేలో ఉన్న నాలుగు ప్లాట్ల ఈ-వేలం ఈ రోజు జరిగింది. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిఫ్యులేటర్స్ అథారిటీ ) ఆన్ లైన్ ద్వారా వేలం పాట నిర్వహించింది. నాలుగు ప్లాట్ల ధరను రూ.19 లక్షలుగా నిర్ణయించగా.. ఒక ప్లాట్‌కు మాత్రం భారీగా పలికింది.

ఒక ప్లాట్ రిజర్వ్ ధర రూ.15,400 ఉండగా దాని కోసం చాలామంది పోటీ పడ్డారు. చివరికి రూ.2 కోట్లకు ఒకరు పాడి దక్కించుకున్నారు. మిగతా మూడు మాత్రం తక్కువ ధర పలికాయి. ఒక ప్లాట్ రూ.1.56 లక్షలకు కోట్ చేయగా రూ.3.28 లక్షలకు వేలం పాడారు.ఈ ఆస్తులు దావూద్ తల్లి అమీనాకు చెందినవి అని వేలం వేసిన సంస్థ (SAFEMA) పేర్కొంది. స్మగ్లింగ్, నార్కొటిక్ డ్రగ్స్ యాక్ట్ ఆధారంగా దావూద్ ఇబ్రహీం, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల వేలం వేశామని తెలిపింది. ఇప్పుడే కాదు 2020, 2017లో కూడా దావూద్ (Dawood) ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగింది.

Updated Date - Jan 05 , 2024 | 05:57 PM