Share News

Covid Vaccine: సుప్రీంకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం..

ABN , Publish Date - May 01 , 2024 | 01:43 PM

కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్‌పై వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ణప్తి చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత చనిపోయిన, వైకల్యం చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.

Covid Vaccine: సుప్రీంకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం..

ఢిల్లీ: కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్‌పై వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ణప్తి చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత చనిపోయిన, వైకల్యం చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. యూకే న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎపెక్ట్స్ ఉన్నట్లు కంపెనీ అంగీకరించింది.

CM Revanth: తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది ‘గాడిద గుడ్డు’.. రేవంత్ ట్వీట్


యూకేకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్‌ టీకా కొవిషీల్డ్‌తో అత్యంత అరుదుగా రక్తం గడ్డకట్టే అవకాశముందని సంస్థ అంగీకరించింది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా కొవిడ్‌ వ్యాక్సిన్లను తయారు చేసింది. వాటిని కొవిషీల్డ్‌, వాక్స్‌జెవ్రియా పేర్లతో ప్రపంచ వ్యాప్తంగా విక్రయించింది. అయితే ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చిన పలువురు యూకేలోని ఓ హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయని సంస్థ వెల్లడించింది.

ఇదికూడా చదవండి: Secunderabad-Ramanadhapuram: సికింద్రాబాద్‌-రామనాథపురం రైలు సేవల పొడిగింపు

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2024 | 01:43 PM