Share News

Container lorry: అర్ధరాత్రి కంటైనర్‌ లారీ ఆకస్మిక తనిఖీ.. కరెన్సీ నోట్ల కట్టలు స్వాధీనం?

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:45 AM

పాడి ఫ్లైఓవర్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి హరియాణా రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ కలిగిన కంటైనర్‌ లారీ(Container lorry)ని ఎన్నికల సంఘం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు చేశారు.

Container lorry: అర్ధరాత్రి కంటైనర్‌ లారీ ఆకస్మిక తనిఖీ.. కరెన్సీ నోట్ల కట్టలు స్వాధీనం?

- పాడి ఫ్లైఓవర్‌ వద్ద కలకలం

చెన్నై: పాడి ఫ్లైఓవర్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి హరియాణా రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ కలిగిన కంటైనర్‌ లారీ(Container lorry)ని ఎన్నికల సంఘం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు చేశారు. ఆ కంటైనర్‌ లారీ ముందువరుసలో ఉన్న కొన్ని అట్టపెట్టెలను తనికీ చేయగా బీజేపీ జెండాలు, టోపీలు కనిపించాయి. ఆ తర్వాత వరుసలో ఉన్న అట్టపెట్టెలను తెరచిన అధికారులు చట్టుకున వాటిని మూసివేసి కంటైనర్‌ తలుపులకు తాళం బిగించారు. ఆ తర్వాత ఆ కంటైనర్‌ లారీ వద్దకు సుమారు 50 మంది సాయుధ పోలీసులను రప్పించారు. కంటైనర్‌ లారీని విల్లివాక్కంలోని ప్రైవేటు పాఠశాల(Private school) మైదానానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ కంటైనర్‌ లారీ చూడటానికి పెద్ద సంఖ్యలో గుమికూడారు. సోమవారం వేకువజాము ఆ కంటైనర్‌ లారీ అమింజికరైకి తీసుకెళ్లారు. ఆ లారీలోని అట్టపెట్టెలలో కరెన్సీ నోట్ల కట్టలు ఉండటం వల్లే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తరచూ ఆ లారీని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆ కంటైనర్‌లో ఏముందో ప్రకటించకుండా ఎన్నికల సంఘం అధికారులు ఇంకా మౌనం పాటిస్తున్నారు.

nani2.jpg

Updated Date - Mar 26 , 2024 | 11:45 AM