Share News

కంగనను కొట్టిన మహిళా కానిస్టేబుల్‌ అరెస్టు

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:07 AM

చండీగఢ్‌ విమానాశ్రయంలో బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎ్‌సఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయగా.. విధుల నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకించిన రైతులపై గతంలో కంగన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆమెపై చేయు చేసుకున్నట్లు కుల్విందర్‌ కౌర్‌ వెల్లడించారు.

కంగనను కొట్టిన మహిళా కానిస్టేబుల్‌ అరెస్టు

చండీగఢ్‌, జూన్‌ 7: చండీగఢ్‌ విమానాశ్రయంలో బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎ్‌సఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయగా.. విధుల నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకించిన రైతులపై గతంలో కంగన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆమెపై చేయు చేసుకున్నట్లు కుల్విందర్‌ కౌర్‌ వెల్లడించారు. మరోవైపు, కుల్విందర్‌ కౌర్‌కు పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ ఘటనపై సరైన విచారణ జరపాలంటూ పంజాబ్‌ డీజీపీని కలసి కోరతామని ఆ సంఘాల నేతలు సర్వణ్‌ సింగ్‌ పందేర్‌, జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ మీడియాకు వెల్లడించారు. ఇదే డిమాండ్‌తో ఈనెల 9వ తేదీన మొహాలీలోని ఎస్పీ కార్యాలయానికి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 06:59 AM