Share News

Delhi: విమానాల్లో పిల్లలకు అమ్మానాన్నల పక్కనే సీటు

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:04 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: విమానాల్లో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరేక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ఆదేశాలిచ్చింది.

Delhi: విమానాల్లో పిల్లలకు అమ్మానాన్నల పక్కనే సీటు

విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: విమానాల్లో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరేక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ఆదేశాలిచ్చింది. 12 ఏళ్ల లోపు పిల్లలకు అదే పీఎన్‌ఆర్‌ నంబరుపై ప్రయాణించే వారి తల్లిదండ్రులు/సంరక్షకుల్లో కనీసం ఒకరి పక్కనైనా సీటు కేటాయించాలని సూచించింది. ఇందుకు సంబంధించి రికార్డులు కూడా నమోదు చేయాలని ఆదేశించింది.

పిల్లలకు తల్లిదండ్రులు/ సంరక్షకుల పక్కన సీటు ఇవ్వకపోవడంపై పలు ఫిర్యాదుల వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. అలాగే ‘2024 ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్కూలర్‌-01’ను సవరించినట్లు తెలిపింది. దాని ప్రకారం విమానయాన సంస్థలకు జీరో బ్యాగేజీ, సీట్ల ప్రాధాన్యం, భోజనం/ స్నాక్స్‌ /పానియాలు వంటి సేవలపై రుసుము వసూలు చేసుకునే అవకాశం కల్పించింది.

Updated Date - Apr 24 , 2024 | 06:17 AM