Share News

Cherla: పామేడు అడవుల్లో వైమానిక దాడులు!

ABN , Publish Date - Apr 12 , 2024 | 08:57 AM

ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పామేడు అడవుల్లో ఈనెల 7వ తేదీన నక్సల్స్‌ లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

Cherla: పామేడు అడవుల్లో వైమానిక దాడులు!

- 30 చోట్ల దాడులను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ

చర్ల, ఏప్రిల్‌ 11: ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పామేడు అడవుల్లో ఈనెల 7వ తేదీన నక్సల్స్‌ లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. గురువారం ఈ మేరకు మావోయిస్టు పార్టీ బస్తర్‌ డివిజన్‌ కమిటీ నేత గంగ పేరుతో లేఖ విడుదలైంది. 7వ తేదీన రాత్రి 11 గంటల సమయంలోనూ రాకెట్‌ దాడులు జరిగినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. పామేడులోని పాలగూడ, ఇట్టగూడ, జిలోర్‌గట్ట, గొమ్మగూడ, కంచాల గ్రామాల అడవుల్లో 30 చోట్ల ఈ దాడులు జరిగాయని తెలిపారు. ఈ రాకెట్లు పడ్డ చోట.. 100-200 మీటర్ల పరిధిలో వన్యమృగాలు చనిపోయాయని, చెట్లు ధ్వంసమయ్యాయని వివరించారు. వైమానిక దాడుల వల్ల గ్రామీణ ప్రజలు ఆందోళన చెందుతున్నారని, పోలీసులు-పారామిలటరీ బలగాలు చేస్తున్న ‘కాగర్‌’ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.

Updated Date - Apr 12 , 2024 | 08:57 AM