Chennai: వామ్మో.. ఇప్పుడే ఇలాఉంటే ఇక మే నెలలో పరిస్థితి ఏంటో.. ఈరోడ్‌లో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:05 AM
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 14 ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అధికంగా ఈరోడ్‌లో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 14 ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అధికంగా ఈరోడ్‌లో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కరూర్ పరమత్తిలో 40.5 డిగ్రీలు, సేలం, వేలూరు, ధర్మపురి(Dharmapuri)లో 40 డిగ్రీలు తిరుచ్చిలో 39.4 డిగ్రీలు, కోవై, మదురై విమానాశ్రయం, తిరుత్తణిలో 38.8 డిగ్రీలు, తిరుపత్తూర్‌లో 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
ఇదికూడా చదవండి: Ramdas: తేల్చి చెప్పేశారు.. భవిష్యత్తులో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోం..