Share News

Chennai: వామ్మో.. జాగ్రత్త.. టాయిలెట్‌ బేసిన్‌లో చిక్కుకున్న బాలుడి కాలు

ABN , Publish Date - Feb 11 , 2024 | 10:55 AM

స్థానిక మైలాపూర్‌లో టాయిలెట్‌ బేసిన్‌ బాలుడి చిక్కుకున్న ఘటనలో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా కాలును వెలికితీశారు.

Chennai: వామ్మో.. జాగ్రత్త.. టాయిలెట్‌ బేసిన్‌లో చిక్కుకున్న బాలుడి కాలు

చెన్నై: స్థానిక మైలాపూర్‌లో టాయిలెట్‌ బేసిన్‌ బాలుడి చిక్కుకున్న ఘటనలో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా కాలును వెలికితీశారు. మైలాపూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని నివసిస్తున్న వినోద్‌(Vinod), మూడున్నరేళ్ల కుమారుడు శుక్రవారం సాయంత్రం టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో బేసిన్‌లో కాలు చిక్కుకుంది. బాలుడి కేకలకు అక్కడుకు చేరుకున్న తల్లిదండ్రులు బేసిన్‌ నుంచి కాలు వెలుపలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో, తల్లిదండ్రుల సమాచారంతో మైలాపూర్‌ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని కాలు మెలికపడినట్లు గుర్తించారు. దీంతో, సిబ్బంది బాలుడితో మాట్లాడుతూ, సుమారు రెండు గంటలు శ్రమించి, పింగాణి బేసిన్‌ బద్దలుకొట్టి వెలికితీశారు.

Updated Date - Feb 11 , 2024 | 10:55 AM