Share News

Chennai: తూత్తుకుడిలో రూ.2వేల కోట్లతో ఎలక్ట్రిక్‌ కార్ల కర్మాగారం

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:13 PM

తూత్తుకుడి జిల్లాలో వియత్నాం దేశానికి చెందిన ‘విన్‌ఫాస్ట్‌’ సంస్థ ఎలక్ట్రిక్‌ కార్లు, విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ కర్మాగారం నెలకొల్పనుంది. మొదట చెంగల్పట్టు జిల్లా మరైమలైనగర్‌లో పనిచేస్తున్న ‘ఫోర్డ్‌’ సంస్థ కార్ల తయారీ కర్మాగారంలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి విన్‌ఫాస్ట్‌ సంస్థ నిర్ణయించింది.

Chennai: తూత్తుకుడిలో రూ.2వేల కోట్లతో ఎలక్ట్రిక్‌ కార్ల కర్మాగారం

ఐసిఎఫ్‌(చెన్నై): తూత్తుకుడి జిల్లాలో వియత్నాం దేశానికి చెందిన ‘విన్‌ఫాస్ట్‌’ సంస్థ ఎలక్ట్రిక్‌ కార్లు, విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ కర్మాగారం నెలకొల్పనుంది. మొదట చెంగల్పట్టు జిల్లా మరైమలైనగర్‌లో పనిచేస్తున్న ‘ఫోర్డ్‌’ సంస్థ కార్ల తయారీ కర్మాగారంలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి విన్‌ఫాస్ట్‌ సంస్థ నిర్ణయించింది. అయితే అక్కడ స్థలాభావంతో తూత్తుకుడి(Tuttukudi) జిల్లాలో 400 ఎకరాల్లో తొలివిడతగా రూ.2,000 కోట్లతో 50 వేల ఎలక్ట్రిక్‌ కార్లు తయారు చేసే సామర్థ్యం కలిగిన కర్మాగారాన్ని విన్‌ఫాస్ట్‌ సంస్థ నెలకొల్పనుంది. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం ఈ నెల 7, 8 తేదీల్లో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడులో జరగనుందని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 06 , 2024 | 01:13 PM