Share News

Chennai: ఆంధ్రా క్లబ్‌లో ఎన్నికలు జరపండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:32 PM

సుదీర్ఘకాలంగా ఎన్నికల జరగకుండా, కేవలం ఆపద్ధర్మ, తాత్కాలిక కమిటీలతో నడుస్తున్న టి.నగర్‌లోని ‘ఆంధ్రా క్లబ్‌’కు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ క్లబ్‌ సభ్యుడు, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethi Reddy Jagadeeswara Reddy) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Chennai: ఆంధ్రా క్లబ్‌లో ఎన్నికలు జరపండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి

- ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు
- విచారణ 3 వారాలకు వాయిదా

చెన్నై: సుదీర్ఘకాలంగా ఎన్నికల జరగకుండా, కేవలం ఆపద్ధర్మ, తాత్కాలిక కమిటీలతో నడుస్తున్న టి.నగర్‌లోని ‘ఆంధ్రా క్లబ్‌’కు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ క్లబ్‌ సభ్యుడు, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethi Reddy Jagadeeswara Reddy) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు కారణంగా ఎనిమిదేళ్లుగా క్లబ్‌కు ఎన్నికలు జరగలేదని, ఈ కారణంగా క్లబ్‌ ఆలనాపాలనా కరువైపోయిందని పిటిషన్‌లో వాపోయారు. 3 వేలమంది సభ్యులున్న క్లబ్‌లో సరైన కమిటీ లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను త్వరగా తేల్చి, సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని కేతిరెడ్డి అభ్యర్థించారు. శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్జి మాష్‌ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - Feb 17 , 2024 | 12:32 PM