Share News

Chennai: మాజీసీఎం ఫైర్.. డీఎంకేకు ఎడప్పాడి దాసోహం అయ్యారు...

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:38 PM

‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే సిద్ధాంతంలో ద్వందవైఖరి అవలంబిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి డీఎంకేకు కొమ్ము కాస్తున్నారని మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వం(Former CM O. Panneerselvam) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chennai: మాజీసీఎం ఫైర్.. డీఎంకేకు ఎడప్పాడి దాసోహం అయ్యారు...

- ఓపీఎస్‌ ఆగ్రహం

చెన్నై: ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే సిద్ధాంతంలో ద్వందవైఖరి అవలంబిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి డీఎంకేకు కొమ్ము కాస్తున్నారని మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వం(Former CM O. Panneerselvam) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో... 2022వ సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పళనిస్వామి, ఒకే దేశం ఒకే ఎన్నిక అమలుకు వస్తే పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు జరిగే అవకాశముంటుందని, ప్రస్తుత డీఎంకే పాలన అధికారం నుంచి దిగిపోతుందని విమర్శించారన్నారు. అయితే ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకొని డీఎంకేకు దాసోహమై అన్నాడీఎంకే సిద్ధాంతాలను మంటగలుపుతున్నారని విమర్శించారు. ఈ నెల 14న రాష్ట్ర అసెంబ్లీలో డీఎంకే ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిందని, ఈ తీర్మానానికి అన్నాడీఎంకే ఏకగ్రీవంగా మద్దుతు పలికందన్నారు. దీన్నిబట్టి ఎడప్పాడి ఎవరన్నది స్పష్టమైందని తెలిపారు. డీఎంకే దుష్టశక్తి అని పదేపదే అన్నాడీఎంకే బహిరంగ సభలు, ధర్నా వేదికలపై ప్రకటించిన పళనిస్వామి, ప్రస్తుతం అధికార డీఎంకేతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని అన్నాడీఎంకే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, సుమారు 2 కోట్ల మందికి పైగా సభ్యులున్న అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టిన ఈపీఎ్‌సను కార్యకర్తలు నిలదీయాలని ఓపీఎస్‌ పిలుపునిచ్చారు.

Updated Date - Feb 17 , 2024 | 01:38 PM