Share News

Chennai: మద్దతిస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు.. ఓపీఎస్‌పై అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ సంచలన ఆరోపణ

ABN , Publish Date - Feb 28 , 2024 | 10:43 AM

అన్నాడీఎంకేకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో తనకు అనువైన తీర్పు కోసం మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం రూ.5 కోట్లకు బేరమాడారని ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ చెప్పారు.

Chennai: మద్దతిస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు..   ఓపీఎస్‌పై అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ సంచలన ఆరోపణ

చెన్నై: అన్నాడీఎంకేకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో తనకు అనువైన తీర్పు కోసం మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం రూ.5 కోట్లకు బేరమాడారని ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ చెప్పారు. రాణిపేట జిల్లా వాలాజా సమీపంలో ఉన్న చెన్నైసముద్రం గ్రామంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ పాల్గొని ప్రసంగించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలిత ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని పార్టీని, రెండాకుల గుర్తును కాపాడారని, ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి అనుకూలంగా తీర్పులు వెలువరించాయని తెలిపారు. పార్టీ పేరును, ఎన్నికల గుర్తు రెండాకులను పొందాలని పన్నీర్‌సెల్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, అందువల్ల పార్టీకి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సంతకం చేయకుండా, తనకు మద్దతిస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఓపీఎస్‌ బేరమాడారని ఆరోపించారు. అందుకు తాను తిరస్కరించడంతో పాటు వెంటనే ఈపీఎ్‌సకు సమాచారం అందించానన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓపీఎస్‌ వంటి వెన్నుపోటుదారులు అన్నాడీఎంకే గెలుపును అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారని, అయితే, సైనికుల్లా పనిచేస్తున్న కార్యకర్తలు పార్టీని అన్ని స్థానాల్లో గెలిపిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 10:43 AM