Share News

Bihar: కొత్త స్పీకర్‌గా నంద కిషోర్ యాదవ్...13న ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Feb 12 , 2024 | 05:54 PM

బీహార్‌ అసెంబ్లీలో నితీష్ కుమార్ సర్కార్ బలపరీక్షలో నెగ్గడంతో రెండు వారాలుగా నెలకొన్న ఉత్కంఠకు సోమవారంనాడు తెరపడింది. బలపరీక్షకు 122 మంది సభ్యుల మ్యాజిక్ ఫిగర్ అవసరం కాగా, నితీష్‌కు మద్దతుగా 129 మంది శాసనసభ్యులు ఓటేశారు. అనంతరం అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బీజేపీ నేత, మాజీ మంత్రి నంద కిషోర్ యాదవ్ పేరును ఖరారు చేశారు.

Bihar: కొత్త స్పీకర్‌గా నంద కిషోర్ యాదవ్...13న ప్రమాణస్వీకారం

పాట్నా: బీహార్‌ అసెంబ్లీలో నితీష్ కుమార్ (Nitish Kumar) సర్కార్ బలపరీక్షలో నెగ్గడంతో రెండు వారాలుగా నెలకొన్న ఉత్కంఠకు సోమవారంనాడు తెరపడింది. బలపరీక్షకు 122 మంది సభ్యుల మ్యాజిక్ ఫిగర్ అవసరం కాగా, నితీష్‌కు మద్దతుగా 129 మంది శాసనసభ్యులు ఓటేశారు. అనంతరం అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బీజేపీ నేత, మాజీ మంత్రి నంద కిషోర్ యాదవ్ (Nanda Kishore Yadav) పేరును ఖరారు చేశారు. ఈనెల 13వ తేదీన ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.


నితీష్ కుమార్ బలపరీక్షకు ముందు గత సర్కార్‌లో స్పీకర్‌గా ఉన్న ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవథ్ బిహారీ చౌదరి‌పై అధికార పక్షం సోమవారంనాడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తొలుత మహాఘట్‌బంధన్‌కు నితీష్ ఉద్వాసన చెప్పి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో కలిసి ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో చౌదరిని స్పీకర్ పదవి నుంచి తప్పుకోవాలని ఎన్డీయే కోరింది. ఆయన నిరాకరించడంతో అసెంబ్లీలో చౌదరిపై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 ఓట్లు పడటంతో స్పీకర్‌కు ఉద్వాసన పలికారు. దీంతో కొత్త స్పీకర్ నియామకానికి మార్గం సుగమమైంది. కీలకమైన స్పీకర్ పదవిని బీజేపీ దక్కించుకోవడం విశేషం.

Updated Date - Feb 12 , 2024 | 05:54 PM