Share News

BJP, Congress: బీజేపీ వైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చూపు? అదేగాని జరిగితే ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ పని గోవిందా..

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:13 PM

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ మహిళా ఎమ్మెల్యే విజయధరణి(MLA Vijayadharani) బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

BJP, Congress: బీజేపీ వైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చూపు? అదేగాని జరిగితే ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ పని గోవిందా..

చెన్నై: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ మహిళా ఎమ్మెల్యే విజయధరణి(MLA Vijayadharani) బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా గత రెండు రోజులుగా శాసనసభ సమావేశాలకు కూడా ఆమె హాజరుకావడం లేదు. దీంతో ఆమె పార్టీ మారడం ఖాయమనే ప్రచారం సాగుతుంది. గత 2011, 2016, 2021లో జరిగిన ఎన్నికల్లో ఆమె మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆమె కన్నియాకుమారి జిల్లా విలవంగోడు అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుండటంతో ఆమె కూడా కాషాయం కండువా కప్పుకునేందుకు హస్తినలో మకాం వేసివున్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఆమెను కొన్ని మీడియా సంస్థలు సంప్రదించగా, ఒక కేసు విచారణ కోసం ఢిల్లీకి వచ్చినట్టు సమాధాన మిచ్చారు. అదేవిధంగా బీజేపీలో చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారాన్ని కూడా ఆమె తోసిపుచ్చలేదు. దీంతో ఆమె బీజేపీలో చేరడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.

nani6.jpg

Updated Date - Feb 15 , 2024 | 12:13 PM