Share News

BJP: బీజేపీ అధికార ప్రతినిధిగా అశ్వత్థనారాయణ

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:49 PM

బీజేపీ(BJP) అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్సీ అశ్వత్థనారాయణ(Former MLC Aswatthanarayana)ను నియమించారు. రాష్ట్ర బీజేపీ కమిటీలను బలోపేతం చేసే దిశగా అధ్యక్షులు విజయేంద్ర పలు కమిటీలను

BJP: బీజేపీ అధికార ప్రతినిధిగా అశ్వత్థనారాయణ

- సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా ప్రశాంత్‌మాకనూరు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బీజేపీ(BJP) అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్సీ అశ్వత్థనారాయణ(Former MLC Aswatthanarayana)ను నియమించారు. రాష్ట్ర బీజేపీ కమిటీలను బలోపేతం చేసే దిశగా అధ్యక్షులు విజయేంద్ర పలు కమిటీలను గురువారం ప్రకటించారు. అధికార ప్రతినిధులుగా 11 మందిని ఖరారు చేశారు. వీరు ఇకపై పార్టీకు సంబంధించి వివిధ టెలివిజన్‌ ఛానల్స్‌లోనే కాకుండా ఇతరత్రా అంశాలపై స్పందిస్తుంటారు. ప్రధాన అధికార ప్రతినిధిగా అశ్వత్తనారాయణను మరోసారి కొనసాగించారు. సీనియర్‌ పాత్రికేయుడు హరిప్రకాష్‌ కొణెమనె, ఎమ్మెల్సీలు ఛలవాది నారాయణస్వామి, తేజస్వినీగౌడ, కెఎస్‌ నవీన్‌, ఎంజీ మహేష్‌, హెచ్‌ఎన్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ నరేంద్రరంగప్ప, సురభి హూదిగెరె, అశోక్‌ కెఎంగౌడ, హెచ్‌.వెంకటే్‌ష దొడ్డేరిలు ఉన్నారు. ఇక సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌గా ప్రశాంత్‌ మాకనూరు. సహ సంచాలకులుగా నరేంద్రమూర్తిలను నియమించారు. ఐటీ విభాగం కోఆర్డినేటర్‌ నితిన్‌రాజ్‌ నాయక్‌, సహ కోఆర్డినేటర్‌గా శ్యామలారఘు, మీడియా కోఆర్డినేటర్‌గా కరుణాకరఖాసలెను మరోసారి కొనసాగించారు. సహాయ కోఆర్డినేటర్‌గా ప్రశాంత్‌ కడంజిలను నియమిస్తూ జాబితాను విడుదల చేశారు.

Updated Date - Jan 05 , 2024 | 01:49 PM